E-Paper
Advertisement

Swayambu Overseas: భారీ ధరలకు నిఖిల్ స్వయంభు ఓవర్సీస్ రైట్స్.. ఆల్ టైం రికార్డ్!

Swayambu Overseas: భారీ ధరలకు నిఖిల్ స్వయంభు ఓవర్సీస్ రైట్స్.. ఆల్ టైం రికార్డ్!
Advertisement

Swayambu Overseas: నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddarth) పరిచయం అవసరం లేని పేరు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని అనంతరం ఇండస్ట్రీలో హీరోగా బిజీగా మారిపోయారు.. ఈయన క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక త్వరలోనే నిఖిల్ “స్వయంభు”(Swayambu)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

స్వయంభు ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్..

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మైథాలజికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఈ సినిమా విడుదల తేది ఖరారు కావడంతో సినిమా బిజినెస్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ కి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయినట్టు సమాచారం. ఇప్పటివరకు నిఖిల్ కెరియర్ లోనే ఏ సినిమాకు జరిగిన విధంగా ఓవర్సీస్ లో స్వయంభు సినిమా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

రూ.7 కోట్లకు ఓవర్సీస్ రైట్స్..

Advertisement

స్వయంభు ఓవర్సీస్ రైట్స్ ఏకంగా ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ రేంజ్ లో స్టార్ హీరోల సినిమాలకు బిజినెస్ అవుతుంది అలాంటిది నిఖిల్ సినిమాకి కూడా ఏడు కోట్ల రూపాయల బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇదివరకు నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన స్వయంభు సినిమాకి కూడా అదే స్థాయిలో క్రేజ్ ఏర్పడిందని తెలుస్తోంది. ఇలా ఓవర్సీస్ రైట్స్ 7 కోట్లకు అమ్ములు పోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

8 భాషలలో స్వయంభు..

Advertisement

ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ 2026 న ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో కూడా మంచి అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భవన్, శ్రీకర్ నిర్మాతలుగా వ్యవహరించగా, ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ కూడా ఫిక్స్ అవడంతో ఇకపై ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేయబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Akhanada 2: జర్మనీలో అఖండ2 కు భారీ క్రేజ్.. రూ.1లక్ష అమ్ముడుపోయిన సూపర్ ఫ్యాన్ టికెట్!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×