E-Paper
Advertisement

Temba Bavuma: గిల్ కంటే KL రాహుల్ బెటర్… ఇజ్జత్ తీసిన టెంబా బావుమా

Temba Bavuma: గిల్ కంటే KL రాహుల్ బెటర్… ఇజ్జత్ తీసిన టెంబా బావుమా
Advertisement

Temba Bavuma: దక్షిణాఫ్రికా తో టెస్ట్ సిరీస్ లో ఎదురైన ఘోర పరాభవాన్ని పక్కన పెట్టిన టీమిండియా.. ఇక రేపటినుండి జరగనున్న వన్డే సిరీస్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ నవంబర్ 30 నుండి ప్రారంభం కాబోతోంది. ఆదివారం రోజు జరిగే తొలి మ్యాచ్ కోసం ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది భారత జట్టు.

Also Read: MS Dhoni: పెళ్లంటే స‌ర్గం కాదు న‌ర‌కమే… ధోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement

రాంచీలోని జె.ఎస్.సి.ఏ స్టేడియంలో వరసగా మూడోవ రోజు భారత ప్లేయర్లు చెమటలు చిందించారు. అయితే మూడు మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ కి భారత కెప్టెన్ గిల్ హాజరు కావడం లేదు. కలకత్తా టెస్ట్ సందర్భంగా గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ కి దూరమయ్యాడు. దీంతో ఈ వన్డే సిరీస్ కి కే.ఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు.

 

విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ రాంచీలో నెట్ ప్రాక్టీస్:

Advertisement

ఈ వన్డే సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాంచి నెట్ లో మూడు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞుల రాక జట్టుకు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గిల్, శ్రేయస్ అయ్యర్ గాయల కారణంగా జట్టుకు దూరం కావడంతో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బాధ్యత మరింత పెరిగింది. ఈ క్రమంలో జట్టు బ్యాటింగ్ భారాన్ని ఈ అనుభవజ్ఞులే మోయాల్సి ఉంది. ఈ వన్డే సిరీస్ లో యశస్వి జైస్వాల్ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ వన్డే సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తిరిగి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం జట్టుకు సానుకూల అంశం. కాగా ఈ వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. సౌత్ ఆఫ్రికాపై ఎలా రాణిస్తారనే విషయం కీలకంగా మారింది.

 

రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ జోడి కేఎల్ రాహుల్ కి బలం:

 

సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా శనివారం రోజు రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీల జోడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బవుమా మాట్లాడుతూ.. “టెస్ట్ మ్యాచ్ మధ్యలో కెప్టెన్ గిల్ దూరం కావడం మాకు కలిసొచ్చింది. కానీ వన్డే సిరీస్ విషయంలో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండవచ్చు. కెప్టెన్ కే.ఎల్ రాహుల్ కాస్త బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. వారు సాధారణంగానే కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దీంతో కేప్టన్ పై కొంచెం ఒత్తిడి తగ్గుతుంది. ఇది నిజంగా ఎక్సైటింగ్. అలాగే భారత క్రీడాభిమానులకు చాలా ప్రత్యేకం.

Also Read: Maxwell: SRH లోకి విధ్వంసకర ఆల్ రౌండర్?

ఈ ఇద్దరు లెజెండ్లు చాలా కాలం తర్వాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టడాన్ని చూడడం ఓ పెద్ద అనుభూతి” అని చెప్పుకొచ్చాడు. అయితే రో-కో బ్యాటింగ్ జంటను ఎలా అడ్డుకుంటారు..? అన్న ప్రశ్నకు బవుమా స్పందిస్తూ.. “మిగతా ఆటగాళ్ల లాగా వారిపై కూడా మా ప్రిపరేషన్ చేస్తాం. ఎలాంటి టెక్నిక్స్ అవసరమో.. వాటిని రూపొందిస్తాం. వారు మైదానంలో ఉన్నప్పుడు ఎనర్జీ కొంచెం భిన్నంగా ఉంటుంది. అది కూడా ఒక రకమైన ఆసక్తికరమైన ఎనర్జీ. ఆల్ ది బెస్ట్ టు కె.ఎల్ రాహుల్”. అని వ్యాఖ్యానించాడు.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×