E-Paper
Advertisement

డ్రాగన్ లో ప్రభాస్ ఎంట్రీ? నీల్ సినిమాలో ‘దేవ’ కామియో.. లీక్ నెట్టింట వైరల్ !

డ్రాగన్ లో ప్రభాస్ ఎంట్రీ? నీల్ సినిమాలో ‘దేవ’ కామియో.. లీక్ నెట్టింట వైరల్ !
Advertisement

Dragon Cameo: ప్రశాంత్ నీల్ … కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అయిన ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్ తారక్ తో సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 11, 2027న రిలీజ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో ఓ క్రేజీ క్యామియో ఉండబోతున్న డిస్కషన్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. అవును .. ‘డ్రాగన్’ (NTR31) మూవీలో తారక్ తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించబోతున్నాడనే న్యూస్ ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.

సలార్‌కు డ్రాగన్‌కు లింక్? 

Advertisement

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎలాగైతే లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ అంటూ తన సినిమాల్లో స్టార్స్ క్యామియోలతో మ్యాజిక్ చేశాడో, అలాగే ప్రశాంత్ నీల్ కూడా నీల్ యూనివర్సిటీని డ్రాగన్ తో మొదలెట్టబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది. అందులో భాగంగానే సలార్ సినిమాలోని ఖాన్సార్ ప్రపంచానికి ఎన్టీఆర్ సినిమాలో చూపించబోయే కథకు మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఇవ్వబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.

also read :సుగ్రీవ మూవీ రివ్యూ: కూతురి కోసం సామాన్య తండ్రి ‘అసామాన్య’ పోరాటం….క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాకే!

Advertisement

ఈ ఇద్దరినీ ఎలా లింక్ చేయబోతున్నాడో

మరి సలార్ లోని దేవా కి డ్రాగన్ లో తారక్ కి మధ్య శత్రుత్వం ఉంటుందా.. లేక ఇద్దరు కలిసి విలన్లని మట్టు బెడతారా? అసలు ఈ ఇద్దరినీ ఎలా లింక్ చేయబోతున్నాడో అంటూ కొందరు క్యూరియస్ గా వాచ్ చేస్తుంటే, మరికొంతమంది ఏకంగా ఒక అడుగు ముందుకేసి డ్రాగన్ క్లైమాక్స్ లో డార్లింగ్ ఎంట్రీ ఒక భారీ ట్విస్ట్ లా ఉండబోతుందని, ఆ సీన్ తోనే ‘సలార్ 2’ కి లింక్ ఇస్తారంటూ ముందుగానే ఒక అంచనాకి వచ్చేయడం ఇక్కడ గమనార్హం.

బాక్సాఫీస్ ఎప్పుడూ చూడని నంబర్స్

మామూలుగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అదే నిజంగా ప్రచారంలో ఉన్నట్టుగా ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ ఎంట్రీకి నీల్ స్టైల్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగ్స్ తోడైతే మాత్రం బాక్సాఫీస్ ఎప్పుడూ చూడని నంబర్స్ ని చూడటం ఖాయం.

ఇక ఈ సినిమాలో తారక్ ని ఎప్పుడూ చూడని రా అండ్ రస్టిక్‌గా పాత్రలో కనిపిస్తాడని, డ్రగ్స్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందన్న సంగతి తెల్సిందే. చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా నిజంగా డార్లింగ్ ఎంట్రీ ఇస్తాడా లేక వార్తలు రూమర్స్ కే పరిమితమవుతాయా?

also read :‘పెద్ది’ దెబ్బకు ‘లెనిన్’ విలవిల.. అఖిల్‌ను వెంటాడుతున్న వాయిదాల శాపం!

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×