E-Paper
Advertisement

సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కనపెట్టిన డైరెక్టర్.. కట్ చేస్తే ఇండస్ట్రీలో ఇలా?

సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కనపెట్టిన డైరెక్టర్.. కట్ చేస్తే ఇండస్ట్రీలో ఇలా?
Advertisement

Tollywood Director: సాధారణంగా సినిమాలపై ఉన్నటువంటి ఆసక్తితో ఎంతోమంది సెలబ్రిటీలు వారికి వచ్చిన ఉద్యోగాలను కూడా పక్కనపెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నత పదవులను పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలు హీరోయిన్లు గాను దర్శక నిర్మాతలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్ సైతం తనకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చారని తెలుస్తోంది. మరి ఉద్యోగాన్ని పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన డైరెక్టర్ ఎవరు? ఇండస్ట్రీలో ఆయన సక్సెస్ అందుకున్నారా? అనే విషయానికి వస్తే..

ఎస్సై ఉద్యోగాన్ని పక్కన పెట్టిన బోయపాటి..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు దర్శకుడు బోయపాటి శ్రీను. భద్ర సినిమాతో దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన సింహా, లెజెండ్, వినయ విధేయ రామ, స్కంద, అఖండ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే ఈయనకు సినిమాలు అంటే ఎంతో ఆసక్తి ఉండడంతో తనుకు వచ్చిన ఎస్ఐ ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చారని తెలుస్తోంది. నేడు బోయపాటి శ్రీను పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ గా..

Advertisement

1971 ఏప్రిల్ 25వ తేదీ గుంటూరు జిల్లాలోని పెద్దకాకానిలో జన్మించిన బోయపాటి శ్రీను ఎంఎ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్సైగా సెలెక్ట్ అయినప్పటికీ ఆయన మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చారు. కెరీయర్ మొదట్లో పత్రిక విలేకరిగా పనిచేశారు అనంతరం ఫోటోగ్రఫీ స్టూడియోలో పని చేస్తూ ఉండేవారు. పోసాని కృష్ణమురళి ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చిన బోయపాటి శ్రీను 1997లో ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ కథలు రాయడం మొదలుపెట్టారు. అలా ఈయన తన మొదటి సినిమా భద్ర సినిమా కథను అల్లు అరవింద్ కు వినిపించగా ఆయన దిల్ రాజుకు సూచించడంతో రవితేజ హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నిరాశ పరిచిన అఖండ 2…

Advertisement

సినిమాలపై ఆసక్తితో తనకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి బోయపాటి శ్రీను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా అనంతరం దర్శకుడిగా మారి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగారు. ఇక ఇటీవల బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది.

Also Read: కమల్ హాసన్ రజినీ కాంత్ విలన్ గా స్టార్ డైరెక్టర్… ఇదేమీ ట్విస్టు భయ్యా?

Related News

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Varanasi Leak : గుడి దగ్గర ఆ డైనోసర్ ఏంటి..జక్కయ్య నీ ప్లానేంటి సామి..?

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

Big Stories

Advertisement
×