E-Paper
Advertisement

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Advertisement

Tollywood: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ ని వీడి వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి.. బలగం, మసూద చిత్రాలతో హీరోయిన్గా తనను తాను ప్రూవ్ చేసుకున్న కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి.. అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎవరు? ప్రేమ వివాహమా? లేక పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహమా? ఆమెను వివాహం చేసుకోబోయే వ్యక్తి ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్..

ఆమె ఎవరో కాదు.. అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటించిన ‘హలో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటి నివేదితా సతీష్ ( Nivedithaa Sathish). త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు.. నిశ్చితార్థం జరుపుకున్న ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం’ అంటూ క్యాప్షన్ పెట్టింది. తాజాగా ఈమె షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు ప్రముఖులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నివేదిత పోస్టుకి సెలబ్రిటీస్ రియాక్షన్..

Advertisement

ఇకపోతే నివేదితా సతీష్ కాబోయే జంట సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. షేర్ చేసిన ఫోటోలకు ప్రముఖ సెలబ్రిటీస్ ఆండ్రియా జెర్మియా , సంయుక్త, ఎస్తేర్ అనిల్, గాయత్రీ శంకర్, ఏ ఆర్ రెహమాన్ కూతురు ఖతిజా రెహమాన్ ఇలా తదితరులు కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ:యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

నివేదితా సతీష్ కాబోయే వరుడు ఎవరంటే?

Advertisement

ఇకపోతే నివేదిత పంచుకున్న ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ వ్యక్తి ఎవరు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈయన పేరు సుహైబ్ మహమ్మద్. ఫోటోగ్రాఫర్ గా, వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాన్ని జరుపుకోబోతున్నారు.

నివేదితా సతీష్ సినిమా కెరియర్..

తమిళ నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె 2017లో తొలిసారి అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో హీరోయిన్ ప్రియ స్నేహితురాలు కవిత పాత్రలో నటించింది. ధనుష్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్ లో కూడా నటించింది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే . ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది . దీంతో పాటు పలు తమిళ చిత్రాలు, ఓటీటీ సిరీస్లలో కూడా నటించి ఆకట్టుకుంది.

Related News

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

రణబాలి టీజర్ రిలీజ్..’సింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ

టాక్సిక్ డిజాస్టర్ టాక్.. యశ్ ఫస్ట్ రియాక్షన్ ..ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×