E-Paper
Advertisement

Nivetha Thomas: క్రేజీ కాన్సెప్ట్ తో నివేద థామస్ తమ్ముడు ఇండస్ట్రీ ఎంట్రీ

Nivetha Thomas: క్రేజీ కాన్సెప్ట్ తో నివేద థామస్ తమ్ముడు ఇండస్ట్రీ ఎంట్రీ
Advertisement

Nivetha Thomas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో నివేద థామస్ ఒకరు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది నివేదా. నివేద కు విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. నాని హీరోగా చేసిన నిన్ను కోరి సినిమా విపరీతమైన పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది నివేద. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా మంచి పేరును తీసుకొచ్చింది.

స్వతహాగా వివేక్ ఆత్రేయ నివేదాకు ఫ్రెండ్ కావడంతో అంటే సుందరానికి ఈవెంట్ కి హాజరైంది నివేదా. అయితే అప్పటికే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవ్వడంతో తన పేరును మళ్లీ గుర్తు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదే నివేదా గురించి టాలెంటెడ్ యాక్టర్స్ అని మాట్లాడారు. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రస్తుతం సినిమాలు చేయటం తగ్గించారు. అలానే ఉన్నఫలంగా లావు అవ్వడం కూడా సినిమాలు తగ్గించడానికి కారణం అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

Advertisement

సినిమాలు త్వర త్వరగా చేయకపోయినా కూడా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటుంది నివేదా. అయితే నివేదా బ్రదర్ నిఖిల్ థామస్ గురించి సోషల్ మీడియా ఉపయోగించే వాళ్లకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కూడా చాలా యాక్టివ్ గా రీల్స్ అవి చేస్తూ ఉంటాడు. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నిఖిల్ థామస్.

హీరోగా సినిమా 

నిఖిల్ థామస్ హీరోగా బెంగళూరు మహానగరంలో బాలకా అనే ఒక సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది టైటిల్ చూస్తుంటే కొంచెం ఆసక్తికరంగానే ఉంది.

Advertisement

అయితే ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ అని అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని కీలక అంశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్లో వెనుక పంజా సినిమా ఫస్ట్ లుక్ గురించి ఒక ఆర్టికల్ ఉంది మొత్తానికి ఇది ఆ టైంలో జరిగే కథ అని అర్థమవుతుంది.

ప్రూవ్ చేసుకుంటాడా?

నిఖిల్ థామస్ విషయానికి వస్తే ఇంస్టాగ్రామ్ లో తన వీడియోలు బాగా పాపులర్. అంతేకాకుండా చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాడు. అయితే ఈ సినిమా తో నిఖిల్ ప్రూవ్ చేసుకుంటాడా? అనే ఆలోచన చాలా మందికి మొదలైంది ఒకవేళ ఈ సినిమాతో మంచి పేరుగాని సాధించుకున్నాడు అంటే ఇండస్ట్రీకి మరో యంగ్ టాలెంటెడ్ హీరో దొరికాడు అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో మంచి సినిమాను ఎంచుకొని ప్రేక్షకుల్లో గుర్తింపు సాధించడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ విషయాలన్నీ నిఖిల్ గుర్తు పెట్టుకొని మంచి కథలను ఎంచుకుంటే భవిష్యత్తులో అతనికంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది.

Also Read : Ustad Bhagat Singh : పవర్ స్టార్ స్టైలిష్ స్వాగ్, ఫస్ట్ సింగిల్ కంప్లీట్ డీటెయిల్స్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×