E-Paper
Advertisement

Team India: దొంగోడిలా మారిన ఈ టీమిండియా ప్లేయ‌ర్ ఎవ‌రో తెలుసా ?

Team India: దొంగోడిలా మారిన ఈ టీమిండియా ప్లేయ‌ర్ ఎవ‌రో తెలుసా ?
Advertisement

Team India:   టీమిండియా వరుసగా టోర్నమెంట్లు ఆడుకుంటూ ముందుకు వెళ్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో రాణించేందుకు దక్షిణాఫ్రికాతో కూడా ఎల్లుండి నుంచి టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. అయితే ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ టీమిండియా ప్లేయర్ ఫోటో వైరల్ గా మారింది. ముఖానికి నల్లటి గుడ్డ కట్టుకొని, దొంగోడి లాగా ఈ క్రికెటర్ ఉన్నాడు. అంతే కాదు ఐస్ క్యూబ్ వేసుకుని, మైనస్ డిగ్రీలలో స్నానం కూడా చేశాడు. ఆ తర్వాత జిమ్ లో వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ముఖానికి నల్లటి గుడ్డ కట్టుకొని కనిపించాడు. దీంతో ఈ టీమిండియా క్రికెటర్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. అయితే ఆ నల్లటి గుడ్డ కట్టుకున్న ప్లేయర్ ఎవరో కాదు శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill).

ALSO READ: KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ 

కోలుకుంటున్న‌ శుభ్‌మ‌న్ గిల్

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa ) మధ్య గత నెలలో ప్రారంభమైన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో జట్టు నుంచి వైదొలిగాడు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్. మొదటి టెస్ట్ ఆడుతున్న సందర్భంగా మెడనొప్పి కావడంతో టోర్నమెంట్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. దీంతో దాదాపు నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు శుభ్‌మ‌న్ గిల్. అయితే వన్డేలకు శుభ్‌మ‌న్ గిల్ ను సెలెక్ట్ చేస్తారనుకుంటే, గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత‌న్నిసెలెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే శుభ్‌మ‌న్ గిల్ కోలుకుంటున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఎల్లుండి నుంచి జరిగే టి20లో మాత్రం అతడు అందుబాటులో ఉంటాడు.

ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. జ‌ట్టు ప్ర‌క‌టించే స‌మ‌యంలో కూడా శుభ్‌మ‌న్ గిల్ పేరును చేర్చారు. అయితే ఈ నేపథ్యంలో శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill Neck Pain) , ఫిట్నెస్ కోసం కసరత్తులు చేస్తున్న ఫోటోలు తాజాగా వైరల్ గా మారాయి. ఇందులో నల్లటి గుడ్డ కట్టుకొని గిల్ కనిపించాడు. అలాగే జిమ్ లో వర్కౌట్ కూడా చేస్తున్నాడు. అటు ఐస్ గడ్డలలో హీరోయిన్లు చేసిన తరహాలోనే అతడు స్నానం చేశాడు. ఇదంతా ఫిట్నెస్ కోస‌మేన‌ని అంటున్నారు. దీంతో శుభ్‌మ‌న్ గిల్ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఎల్లుండి నుంచే టీ20 సిరీస్

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa ) మధ్య టీ20 సిరీస్ ఎల్లుండి ప్రారంభం కానుంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మొత్తం 5 టీ20లు జ‌రుగ‌నున్నాయి. ఈ టోర్న‌మెంట్ కు సూర్య కుమార్ యాద‌వ్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడు. గిల్ వైస్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×