E-Paper
Advertisement

NTR: మెగాస్టార్‌కు యాక్షన్ చెప్పిన ఎన్టీఆర్.. ఇండస్ట్రీలో అరుదైన సీక్రెట్!

NTR: మెగాస్టార్‌కు యాక్షన్ చెప్పిన ఎన్టీఆర్.. ఇండస్ట్రీలో అరుదైన సీక్రెట్!
Advertisement

NTR: టాలీవుడ్ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మనం ఇప్పుడు చూస్తున్న మల్టీస్టారర్ ట్రెండ్‌కు దశాబ్దాల క్రితమే పునాదులు పడ్డాయి. అయితే, తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన, అత్యంత ఆసక్తికరమైన సంఘటన గురించి ఈ తరం ప్రేక్షకులకు చాలా తక్కువ మందికే తెలుసు. అదే.. నటరత్న ఎన్టీఆర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించడం! ఇది వినడానికి వింతగా ఉన్నా.. అక్షరాలా నిజం.

ఒకే ఫ్రేమ్‌లో రెండు ధృవతారలు!
లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం అంటే అభిమానులకు పూనకాలే. వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం ‘తిరుగులేని మనిషి’. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్‌లో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించగా, చిరంజీవి సెకండ్ హీరోగా మెరిశారు. కానీ, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

రాఘవేంద్రరావుకు అనారోగ్యం.. రంగంలోకి దిగిన ఎన్టీఆర్!
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో, నాలుగో షెడ్యూల్ వద్ద దర్శకుడు రాఘవేంద్రరావు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారట. వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో అందరి డేట్స్ దొరకడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ సంక్షోభాన్ని గమనించిన ఎన్టీఆర్, ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా మెగా ఫోన్ పట్టారు!

చిరంజీవి ఫైట్ సీన్‌కు ఎన్టీఆర్ డైరెక్షన్!
ఆ వారం రోజుల షూటింగ్‌ను ఎన్టీఆర్ పర్యవేక్షించడమే కాకుండా, సినిమాలోనే అత్యంత కీలకమైన ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. చిరంజీవి,విలన్ కైకాల సత్యనారాయణ మధ్య వచ్చే ఒక హై-వోల్టేజ్ ఫైట్ సీన్‌ను స్వయంగా ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారని ఇండస్ట్రీ టాక్. మెగాస్టార్ చిరంజీవి వంటి నటుడికి, ఎన్టీఆర్ వంటి మహానటుడు ‘యాక్షన్’ చెప్పడం అనేది ఒక చారిత్రక ఘట్టమనే చెప్పాలి.

Advertisement

దర్శకత్వంలోనూ ‘అన్నగారు’ మేటి!
ఎన్టీఆర్‌కు దర్శకత్వం కొత్తేమీ కాదు. ‘దాన వీర సూర కర్ణ’, ‘శ్రీ రామ పట్టాభిషేకం’, ‘తాతమ్మ కల’ వంటి క్లాసిక్ సినిమాలతో ఆయన తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. అయితే, రాఘవేంద్రరావు గారి కోసం ఆయన సినిమా బాధ్యతను భుజాన వేసుకోవడం ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి నిదర్శనం. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్ మొదట్లో సీనియర్ హీరోలైన అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు గారితో కలిసి నటించి, ఆ తర్వాత తానే ఒక లెజెండ్‌గా ఎదిగారు.
ఇలాంటి అరుదైన కాంబినేషన్లు మళ్లీ రావడం అసాధ్యం. ఒక లెజెండ్ దర్శకత్వంలో మరో ఫ్యూచర్ లెజెండ్ నటించిన ఈ ‘తిరుగులేని’ జ్ఞాపకం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ స్పెషలే!

also read: మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. బూతు పాటపై కేసు నమోదు..

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×