E-Paper
Advertisement

Air Conditioner: ఏసీతో చల్లగాలికి బదులు.. వేడి గాలి వస్తుందా? అయితే ఏ క్షణమైనా..!

Air Conditioner: ఏసీతో చల్లగాలికి బదులు.. వేడి గాలి వస్తుందా? అయితే ఏ క్షణమైనా..!
Advertisement

Air Conditioner: సమ్మర్ లో ఏసీల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. అధిక వేడి, ఉక్కపోతను తట్టుకోలేక చాలా మంది ఏసీ గదులకే పరిమితం అవుతుంటారు. అయితే కొన్ని ఏసీలు మాత్రం వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. చల్లగాలికి బదులు.. వేడి గాలిని ప్రసారం చేస్తూ ఉంటాయి. అసలు ఏసీ నుంచి వేడి గాలి ఎందుకు వస్తుంది? నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? ఈ కథనంలో పరిశీలిద్దాం.

థర్మోస్టాట్ సెట్టింగ్‌లు్

కొన్నిసార్లు థర్మోస్టాట్ పొరపాటున ‘Heat’ మోడ్‌లో ఉండటం లేదా ఫ్యాన్ కేవలం ‘On’ మోడ్‌లో ఉండటం వల్ల కూడా వేడి గాలి వస్తుంది.

మురికి పట్టిన ఎయిర్ ఫిల్టర్లు

Advertisement

ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే గాలి సరిగ్గా ప్రసరించక ఏసీ పనితీరు తగ్గుతుంది. ఫలితంగా చల్లగాలికి బదులు వెచ్చటి గాలిని ఏసీలు విడుదల చేస్తుంటాయి.

తక్కువ రిఫ్రిజెరెంట్ (Gas)

ఏసీలో గ్యాస్ లీక్ అయినా లేదా తక్కువగా ఉన్నా చల్లటి గాలి రాదని నిపుణులు చెబుతున్నారు.

దుమ్ముపట్టిన అవుట్ డోర్ యూనిట్

Advertisement

బయట వైపు ఉండే అవుట్ డోర్ యూనిట్ దుమ్ముతో నిండిపోతే అది వేడిని సరిగ్గా బయటకు పంపలేదు. ఒక్కోసారి అవుట్ డోర్ యూనిట్ నుంచి వింత శబ్దాలు సైతం వస్తుంటాయి.

విద్యుత్ సమస్యలు

కంప్రెసర్‌కు పవర్ సరిగ్గా అందకపోవడం వల్ల కూడా ఏసీ నుంచి వేడి గాలి విడుదల అవుతుంది. దీని వల్ల కరెంటు బిల్లు సైతం అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది.

Also Read: Air Cooler Tips: కేవలం రూ.500 ఖర్చుతో.. కూలర్‌ను ఏసీలా మార్చేయండి.. క్రేజీ టిప్స్ భయ్యా!

అలాగే వదిలేస్తే ఏమవుతుంది?

వేడిగాలి వస్తున్నా పట్టించుకోకుండా ఏసీని అలాగే వాడితో కొన్ని నష్టాలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీలో అత్యంత కీలకమైన, ఖరీదైన కంప్రెస్ భాగం దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. వేడి గాలిని పంపిస్తు ఓవర్ లోడ్ అయ్యి పూర్తిగా చెడిపోవచ్చు. అలాగే అధికంగా పవర్ బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది. గదిని చల్లబరచడానికి ఏసీ.. నిరంతరం ప్రయత్నిస్తూ ఎక్కువ కరెంటును వినియోగిస్తుంది. దీని వల్ల నెల తిరిగే సరికి సాధారణం కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు రావొచ్చు. అయితే ప్రతీ సీజన్ సమ్మర్ ప్రారంభంలో ఏసీని సర్వీసింగ్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Also Read: Motorola AC: మధ్యతరగతి స్పెషల్.. మోటరోలా ఏసీలు వచ్చేసాయోచ్.. వై-ఫై, యాప్ కంట్రోల్ మరెన్నో ఫీచర్లు!

Related News

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

Big Stories

Advertisement
×