E-Paper
Advertisement

Jr.Ntr -Neel: ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ అప్డేట్.. ఆ విడుదల తేదీ పై డ్రాగన్ కన్ను..

Jr.Ntr -Neel: ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ అప్డేట్.. ఆ విడుదల తేదీ పై డ్రాగన్ కన్ను..
Advertisement

Jr.Ntr -Neel: టాలీవుడ్ స్టార్,  గాడ్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర సినిమా తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమాలో బిజీ అయ్యారు ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న  స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్

ఇక ఈ సినిమా విడుదల అయిన అనంతరం ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగుకు సంబంధించి ఒక అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా నైట్ షూట్ చేసే సన్ని వేషాలు చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సినిమాటోగ్రాఫీ బృందం వెల్లడించారు.

జూన్ 25వ తేదీ విడుదల?

Advertisement

ఇక ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి కూడా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలబడబోతుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం డ్రాగన్ అనే పేరుతో షూటింగ్ పనులను జరుపుకుంటున్నప్పటికీ ఈ సినిమాకు వేరే టైటిల్ ఉందని త్వరలోనే టైటిల్ కూడా గ్రాండ్ ఈవెంట్ ద్వారా రివిల్ చేయబోతున్నట్టు తెలియజేశారు.

ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్ 

Advertisement

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ ప్రశాంత్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమా పట్ల కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ప్రశాంత్ ఎన్టీఆర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ సీక్వెల్ పనులలో బిజీ కానున్నారు.

Also Read: Jana Nayagan: విజయ్ జననాయగన్ సినిమాలో స్టార్ డైరెక్టర్ క్యామియో.. ఊహించని ట్విస్ట్ ..

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×