E-Paper
Advertisement

సుగ్రీవ మూవీ రివ్యూ: కూతురి కోసం సామాన్య తండ్రి ‘అసామాన్య’ పోరాటం….క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాకే!

సుగ్రీవ మూవీ రివ్యూ: కూతురి కోసం సామాన్య తండ్రి ‘అసామాన్య’ పోరాటం….క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Sugriva Review: ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ డ్రామాల ట్రెండ్ బాగానే నడుస్తోంది. అందులోనూ సెంటిమెంట్‌ను జోడిస్తే ఆ సినిమా రేంజే వేరు. అచ్చం అలాంటి కాంబినేషన్‌తో, ఎస్ జి ఎస్ వి మూవీస్ బ్యానర్‌పై నర్తు చిరంజీవి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సుగ్రీవ’. మరి మంచి అంచనాలతో బాలు చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం !

కథ ఏంటంటే?
సాదాసీదా మధ్యతరగతి తండ్రి బాలు (బాలు చరణ్). తన భార్య ప్రశాంతి (కాజల్ తివారి), కూతురు అక్షరలతో సంతోషంగా బ్రతుకుతుంటాడు.కానీ, ఒక ఊహించని మెడికల్ ఎమర్జెన్సీ ఆ కుటుంబంలో చీకటి నింపుతుంది. అక్షర గుండె ఆగిపోకుండా ఉండాలంటే వెంటనే 50 లక్షల రూపాయలు కావాలి. బ్యాంకులు లోన్లు ఇవ్వవు, స్నేహితులు ఆదుకోరు.. ఆ సమయంలో ఒక తండ్రికి వచ్చే కోపం, ఆవేశం బాలుని మాఫియా ప్రపంచం వైపు నడిపిస్తుంది. రామాయణంలో సుగ్రీవుడు రాముడి కోసం ఎలాగైతే యుద్ధం చేశాడో, ఇక్కడ బాలు తన కూతురి ప్రాణం కోసం ఏకంగా మృత్యువుతోనే పోరాడతాడు. ఆ పోరాటంలో అతను గెలిచాడా? మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా గడగడలాడించాడు? అనేది వెండితెరపై చూడాల్సిందే!

Advertisement

విశ్లేషణ
ఈ సినిమాకు ప్రధాన బలం బాలు చరణ్ నటన. తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి, అదే సమయంలో యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన చూపిన తీవ్రత మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. కాజల్ తివారి తన పరిణతి చెందిన నటనతో ఆకట్టుకోగా, విలన్ గా కరణ్ విజయ్ క్రూరత్వం సినిమాకు కావాల్సిన బలాన్ని ఇచ్చింది. సాంకేతికంగా చూస్తే దర్శకుడు నర్తు చిరంజీవి ఎంచుకున్న నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే పద్ధతి సినిమాపై ఆసక్తిని పెంచింది. గతాన్ని, వర్తమానాన్ని ముడిపెడుతూ కథను నడిపించిన తీరు బాగుంది. లక్కీ ఏకరి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ఇవ్వగా, అజయ్ పట్నాయక్ నేపథ్య సంగీతం గ్యాంగ్‌స్టర్ డ్రామాకు తగిన ఫీల్ ఇచ్చింది.అయితే సినిమాలో పాటలు అంతగా రిజిస్టర్ కాకపోవడతో కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీదనే సినిమా ఆధారపడింది.సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • బాలు చరణ్ నటన
  • నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే
  • తండ్రి-కూతుళ్ల  ఎమోషనల్ బాండింగ్
  • క్లైమాక్స్
Advertisement

ప్లస్ పాయింట్స్ :

  • సాంగ్స్
  • అక్కడక్కడ స్లో  స్క్రీన్ ప్లే

చివరిగా …

మొత్తం కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం వంటి చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఎమోషనల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారికి ‘సుగ్రీవ’ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. “ప్రేమ ముందు ఏ శక్తీ నిలబడదు” అనే పాయింట్‌ను మాస్ ఎలిమెంట్స్‌తో జోడించి దర్శకుడు మెప్పించాడనే చెప్పాలి.

Sugriva Review and Rating – 2.5/5

also read :‘పెద్ది’ దెబ్బకు ‘లెనిన్’ విలవిల.. అఖిల్‌ను వెంటాడుతున్న వాయిదాల శాపం!

Related News

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా తమ్ముడి కొడుకు మెప్పించాడా ?

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

Big Stories

Advertisement
×