E-Paper
Advertisement

‘పెద్ది’ దెబ్బకు ‘లెనిన్’ విలవిల.. అఖిల్‌ను వెంటాడుతున్న వాయిదాల శాపం!

‘పెద్ది’ దెబ్బకు ‘లెనిన్’ విలవిల.. అఖిల్‌ను వెంటాడుతున్న వాయిదాల శాపం!
Advertisement

Akhil Lenin : అక్కినేని అయ్యగారికి అస్సల్ కాలం కలిసి రావట్లేదు… హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 10ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఒక్క బ్లాక్ బాస్టర్ ని ఖాతాలో వేసుకోలేకపోయాడు. మొదటి సినిమా అఖిల్ నుండి ఏజెంట్ వరకు అన్నీ అయ్యగారిని డిసప్పాయింట్ చేసినవే. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలి అంటూ మురళి కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ సినిమాని మొదలెట్టాడు. కానీ ఆరంభంలోనే అడ్డంకి అన్నట్టుగా హీరోయిన్ గా చేస్తానని ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసిన శ్రీలీల డేట్స్ లేవంటు హ్యండ్ ఇచ్చేసింది. దాంతో ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. అలా ఆగుతూ సాగుతూ మొత్తానికి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందనిపించుకుంది.

మొదటగా ఏప్రిల్ 30 రిలీజ్

Advertisement

ఇక్కడిదాకా బాగానే ఉన్నా అసలు సినిమా ఇక్కడే మొదలైంది. ఈ సినిమాని మొదటగా ఏప్రిల్ 30 రిలీజ్ అనుకున్నారు. కానీ అదే రోజు పెద్ది వస్తుందన్న వార్తలు రావడంతో మే 1కి వెళ్లారు. తీరా చూస్తే ఆ డేట్ కూడా హం ఫట్ అయిపోయింది. దీంతో సినిమా మే 1కి కూడా రెడీగా లేదన్న క్లారిటీ వచ్చేసింది. మళ్లీ ఇప్పుడేమో జూన్ 25 అంటూ మరో కొత్త డేట్ వినిపిస్తోంది. కానీ ఇక్కడ కూడా అఖిల్‌కు దురదృష్టం వెంటాడుతుంది.

ALSO READ:మార్కెట్ జీరో.. క్రేజ్ నిల్.. అయినా ఆగేదేలే అంటున్న నితిన్ !

Advertisement

‘పెద్ది’ ఫోబియా.. అఖిల్ భయపడుతున్నాడా?

ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ‘పెద్ది’ టీమ్ జూన్ 25నే టార్గెట్ చేస్తోందట. భారీ అంచనాలున్న ‘పెద్ది’ బరిలోకి దిగితే అఖిల్ ‘లెనిన్’ను ఎవరైనా పట్టించుకుంటారా అంటే అనుమానమే. ‘పెద్ది’ లాంటి భారీ ప్రాజెక్ట్ తో పోటీ పడే ధైర్యం ‘లెనిన్’ టీమ్‌కు లేదని, అందుకే సినిమాని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే షూటింగ్ డిలే అవడం వల్ల సినిమాపై నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడేమో డేట్స్ ఇపుడు అప్పుడు అంటూ మారుస్తుండటం వల్ల సినిమాపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం పూర్తిగా పోతున్న పరిస్థితి. మరో వైపు డిస్ట్రిబ్యూటర్లు కూడా అఖిల్ సినిమాను నమ్మి పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు కూడా. ఒకవేళ ‘పెద్ది’తో పోటీ పడితే మాత్రం ‘లెనిన్’ అడ్రస్ లేకుండా పోతుందనేది కాదనలేని సత్యం.

లెనిన్  రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్‌

ఇక ఈ సినిమా విషయంలో ఇప్పటికే రీ-షూట్లు, డీలేలు, అంటూ రకరకాల ప్రచారాలు సర్క్యులేట్ అవుతున్నాయ్. మామూలుగా ఒక సినిమా వస్తుందని అంటే హైప్ ఓ రేంజ్ లో ఉండాలి. కానీ లెనిన్ తో మాత్రం ఇలా రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్‌తో ఉన్న క్రేజ్‌ను కూడా డేంజర్ జోన్ లో పడేస్తున్నాడు అఖిల్. ఇక మేకర్స్ సినిమాని తీయడం కంటే సరైన రిలీజ్ డేట్ ని సర్దుబాటు చేయడంలోనే బిజీగా ఉన్నారంటే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

మొత్తానికి ‘లెనిన్’ కూడా మరో ‘ఏజెంట్’ లాగా డిలే అయ్యి, అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేలానే ఉంది. జూన్ 25న వస్తారో లేక మళ్లీ ఏదో ఒక సాకు చెప్పి పారిపోతారో చూడాలి. అక్కినేని ఫ్యాన్స్ సైతం “ఇక చాలు బాబూ.. ఎప్పుడు వస్తే అప్పుడు రానీయండి” అనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ALSO READ:ఒకే దెబ్బకు రెండు పిట్టలు: అటు చిరు.. ఇటు బాలయ్య.. డింపుల్ క్రేజ్ మామూలుగా లేదుగా!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×