E-Paper
Advertisement

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?
Advertisement

Physical SIM vs eSIM: స్మార్ట్‌ఫోన్ల సాంకేతికత వేగంగా మారుతోంది. ఈ క్రమంలోనే సాంప్రదాయ ప్లాస్టిక్ సిమ్ కార్డుల (SIM) స్థానంలో ఇప్పుడు ఈ-సిమ్ (eSIM) ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏది వాడాలన్న కన్ఫ్యూజన్ మెుబైల్ యూజర్లలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు సిమ్ లకు మధ్య తేడా? వాటి వల్ల కలిగే లాభనష్టాలు? ఆండ్రాయిడ్ ఫోన్లకు ఏది బెస్ట్? వంటి వివరాలను ఈ కథనంలో చూద్దాం.

సంప్రదాయ ప్లాస్టిస్ సిమ్

గత దశాబ్దాల కాలంగా మెుబైల్ యూజర్లు.. ఈ ఫిజికల్ సిమ్ ను వినియోగిస్తూ వస్తున్నారు. ప్లాస్టిక్ సిమ్ ముక్కును ఫోన్ స్లాట్‌లో మాన్యువల్‌గా ఫిక్స్ చేసి.. టెలికాలం సేవలను పొందుతున్నారు. దీనివల్ల కలిగే ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు సిమ్ మార్చడం చాలా సులభం. ఫోన్ పాడైనా, ఛార్జింగ్ అయిపోయినా సిమ్ తీసి వేరే ఫోన్‌లో వేసుకుని వాడుకోవచ్చు. అదే మైనస్ లకు వస్తే.. ఇది ఫోన్‌లో ఎక్కువ స్పేస్ ను ఆక్యుపై చేస్తుంది. అలాగే సిమ్ ట్రే వల్ల ఫోన్‌లోకి ధూళి, నీరు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

మరి ఈ-సిమ్ సంగతేంటి?

Advertisement

ప్రస్తుతం ఇది ఫోన్లలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ. ఈ- సిమ్ అనేది ఫోన్ లోపలే మదర్‌బోర్డ్‌కు అనుసంధానమై ఉండే వర్చువల్ సిమ్. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి కార్డు అవసరం లేదు. నెట్‌వర్క్ ప్రొవైడర్ ఇచ్చే క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్స్ కు వస్తే.. ఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా ఈ-సిమ్‌ను బయటకు తీయడం సాధ్యం కాదు. కాబట్టి ఫోన్‌ను ట్రాక్ చేయడం ఈజీ. అంతేకాకుండా విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి లోకల్ నెట్‌వర్క్‌ను ఫోన్ నుంచే నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక మైనస్లకు వస్తే.. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుండి మరో ఫోన్‌కు సిమ్ సేవలను మార్చుకోవడం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. దీనికోసం ఆపరేటర్ సాయం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

ఆండ్రాయిడ్ యూజర్లకు ఏది బెస్ట్?

Advertisement

తరచూ ఫోన్లు మార్చేవారికి.. ఇప్పటికి కూడా ఫిజికల్ సిమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాకాకుండా మారిన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని భావించేవారికి, భద్రతకు పెద్ద పీట వారు ఈ-సిమ్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత ఆండ్రాయిడ్ ఫోన్లు రెండింటినీ (డ్యూయల్ సిమ్) సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రైమరీ నంబర్‌ను ఈ-సిమ్‌గా మార్చుకుని.. సెకండరీ స్లాట్‌ను ఖాళీగా ఉంచుకోవడం అన్ని రకాలుగా బెస్ట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Related News

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

Big Stories

Advertisement
×