E-Paper
Advertisement

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?
Advertisement

Odia Movie in Telugu Dubbing:సాధారణంగా సౌత్ ఇండియన్ భాషల్లో లేదా హిందీలో ఒక సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది అంటే ఆ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఒక ఒడియా సినిమా తెలుగులో డబ్బింగ్ కి సిద్ధమవుతోంది. ఈ మేరకు తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేక గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. మరి ఏంటా చిత్రం? ఆ గ్లింప్స్ లో ఏముంది? తెలుగులో ఎవరు డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడియా మూవీ..

ఒడియాలో ఘన విజయం సాధించిన జడి ( What If) చిత్రాన్ని మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీ యాన్ష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాజల్ రే నిర్మించిన ఈ చిత్రానికి దిబ్బ జ్యోతి ఉదయ్ సింగ్ రచన, దర్శకత్వం వహించారు. సైలేంద్ర సమంత రాయ్, ప్రియంబద స్వైన్, ఆకాష్ హోతా ప్రధాన పాత్రల్లో నటించగా.. సుశాంత్ దాస్ మహాపాత్ర, బాలకృష్ణ నాయక్, రబీ మిశ్రా, కృష్ణా రౌత్ తదితరులు కీలకపాత్రలో కనిపించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన తెలుగు గ్లింప్స్ విషయానికి వస్తే.. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కాలేజీ యువకుల మధ్య స్నేహం, అనుబంధాలతో ప్రారంభమై.. ప్రేమ కథగా మారుతూ.. స్నేహితుల మధ్య తలెత్తే వివాదాలు, సంఘర్షణలను చాలా ఆసక్తికరంగా పరిచయం చేస్తోంది.

ఆకట్టుకుంటున్న తెలుగు గ్లింప్స్..

Advertisement

ప్రేమ కథకు మించి జీవితంలోని విభిన్న భావోద్వేగాలు, బంధాలను ఈ చిత్రం ఆవిష్కరించనుంది. దర్శకుడు దిబ్బ జ్యోతి ఉదయ సింగ్ గ్రామీణ వాతావరణం, యువత స్నేహం, ప్రేమ, సంఘర్షణలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. రుద్రకాంతా సింగ్ సినిమాటోగ్రఫీ గ్రామీణ అందాలను సహజంగా చూపించగా.. అభిషేక్ పనిగ్రాహి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు. సోమేశ్ సత్పతి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ గా నిలవనుంది. ఇక తెలుగు వెర్షన్ కి రాకేందు మౌళి పాటలు, మాటలు రాశారు. ఈ చిత్రానికి మానసి కుమార్ సాహూ ఎడిటర్ గా వ్యవహరించారు. తెలుగు వెర్షన్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా స్పష్టం చేశారు.

also read:అనసూయ వర్కౌట్స్ వీడియో వైరల్.. ఈ సారి ఏకంగా అలాంటి ట్రోల్స్!

తెలుగు ఆడియన్స్ మద్దతు లభిస్తుందా?

Advertisement

మొత్తానికైతే ఇన్ని రోజులు తమిళ్ , మలయాళం, కన్నడ, హిందీ భాషలలో చిత్రాలు డబ్బింగ్ అయ్యి తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక అలా డబ్బింగ్ అయిన చిత్రాలు తెలుగు స్ట్రైట్ సినిమాలతో పోటీ పడుతూ భారీ స్థాయిలో విడుదలవుతూ కలెక్షన్లు కూడా భారీగా సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఒడియా సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ కి సిద్ధమవుతు తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి వస్తోంది. మరి ఈ ఒడియా చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా తమ మద్దతు పలుకుతారో చూడాలి.

 

Related News

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు..

ఏందమ్మా మానస.. సన్‌సెట్‌లోనూ ఇంత అందంగా ఉన్నావేంటి!

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?

ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న పవన్ వైఫ్ అన్నా ..కారణం అదేనా?

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

Big Stories

Advertisement
×