E-Paper
Advertisement

మందుబాబులకు గుడ్ న్యూస్? తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు..

మందుబాబులకు గుడ్ న్యూస్? తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు..
Advertisement

whisky cheaper in India| విదేశీ విస్కీని ఇష్టపడేవారికి త్వరలో కొంత ఊరట లభించే అవకాశం ఉంది. భారత్‌.. బ్రిటన్ వాణిజ్య ఒప్పందం కారణంగా స్కాచ్ విస్కీ దిగుమతులపై సుంకాలు తగ్గాయి. దీంతో భారత మార్కెట్‌లో స్కాచ్ విస్కీ ధరలు తగ్గుతాయనే అంచనాలు పెరిగాయి. అయితే, దిగుమతి సుంకాలు తగ్గినంత మాత్రాన వినియోగదారులకు అదే స్థాయిలో ధరల తగ్గింపు లభిస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భారత్‌ – బ్రిటన్ ఒప్పందంతో దిగుమతి సుంకాలు తగ్గాయి

భారత్‌ – బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ డీల్ జూలై 15న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం స్కాచ్ విస్కీపై దిగుమతి సుంకాలు 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గాయి. రాబోయే పదేళ్లలో ఈ సుంకాలను 40 శాతానికి తగ్గించాలనే ప్రణాళిక ఉంది.
ఈ మార్పులతో భారత్‌లో దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీ ధరలు తగ్గనున్నాయి. అయితే ప్రీమియం మద్యం మార్కెట్‌లో పోటీ కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇండియా మార్కెట్‌ కీలకం

Advertisement

స్కాచ్ విస్కీ అసోసియేషన్ (SWA) ప్రకారం.. 2025లో భారత్‌కు స్కాచ్ విస్కీ ఎగుమతుల విలువ 286 మిలియన్ బ్రిటిష్ పౌండ్లుగా నమోదైంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.3,614 కోట్లకు సమానం.

వ్యాల్యూ పరంగా భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద స్కాచ్ విస్కీ మార్కెట్‌గా ఉంది. ఎగుమతుల విలువలో మాత్రం అమెరికా, ఫ్రాన్స్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ప్రీమియం మద్యానికి పెరుగుతున్న ఆదరణతో భారత్ త్వరలో అమెరికాను అధిగమించే అవకాశముంది.

వినియోగదారులకు ధరలు ఎంతవరకు తగ్గుతాయి?

Advertisement

దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల స్కాచ్ విస్కీ ధరలు వెంటనే భారీస్థాయిలో తగ్గకపోవచ్చు. రాష్ట్రాల పన్నులు, రవాణా ఖర్చులు, పంపిణీ వ్యయాలు, రిటైలర్ల మార్జిన్లు తుది ధరను ప్రభావితం చేస్తాయి. మోడి ఇల్వా మేనేజింగ్ డైరెక్టర్, CIABC బోర్డు సభ్యుడు అభిషేక్ మోడి ప్రకారం, వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లు అందుబాటులోకి రావచ్చు. కొన్ని మార్కెట్లలో ఇప్పటికే స్కాచ్ విస్కీ ధరలు తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, బ్రాండ్‌ను బట్టి, రాష్ట్రాన్ని బట్టి ధరల తగ్గింపు ఉంటాయి.

Also Read: ఈ 7 రకాల వ్యక్తులతో గొడవపడితే మీకే నష్టం.. వీరితో శత్రుత్వం అసలు పెట్టుకోకూడదు

భారతీయ విస్కీ తయారీదారులకు పెరుగుతున్న పోటీ

భారతీయ మద్యం తయారీదారులు దిగుమతి సుంకాల తగ్గింపును స్వాగతిస్తున్నప్పటికీ, సమానమైన పన్నుల విధానాన్ని కోరుతున్నారు. దేశీయ ఉత్పత్తులపై రాష్ట్రాలవారీగా పన్నులు, ఇతర ఛార్జీలు మారడం తమకు ఇబ్బందిగా ఉందని వారు చెబుతున్నారు.

చౌకగా లభించే బల్క్ స్కాచ్ విస్కీని భారతీయ కంపెనీలు ప్రీమియం మిశ్రమాల తయారీలో ఉపయోగించవచ్చు. దీనివల్ల స్థానిక బాట్లింగ్, ప్యాకేజింగ్, ఉపాధికి అవకాశాలు పెరగవచ్చు.

Also Read: తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు.. పీపీఎఫ్ డబ్బులు తీసుకున్నారని కేసు.. తీర్పు ఇదే

భారతీయ బ్రాండ్లు నాణ్యతపై దృష్టి పెట్టాలి

లివింగ్ లిక్విడ్జ్ వ్యవస్థాపకుడు, కార్టెల్ బ్రదర్స్ సహ వ్యవస్థాపకుడు మోక్ష్ సాని ప్రకారం, భారతీయ కంపెనీలు నాణ్యత, కొత్త రుచులు, ప్రత్యేకమైన బ్రాండింగ్‌పై దృష్టి పెట్టాలి.

Related News

పతనానికి బ్రేక్.. మళ్లీ బంగారం ధరలు పైపైకి, ఇవాళ మార్కెట్లో ధరలు

జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

ఏడాదికి రూ.3.25 కోట్ల వరకు వేతనం.. ఏఐ కంపెనీలో రైటర్లు కావలెను మీరూ ట్రై చేసేయండి

ఉద్యోగం పోయింది, ఆర్థిక సంక్షోభం వస్తే ఎలా? ఎమర్జెన్సీ ఖర్చులకు అప్పు చేయకుండా ఈ 3 పనులు చేయండి

దీపావళి వేళ బాణాసంచా ప్రమాదాలు.. కేవలం రూ.11కే ఇన్సూరెన్స్.. రూ.25,000 వరకు కవరేజ్

కిలో వెండి రూ.4.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?

తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు.. పీపీఎఫ్ డబ్బులు తీసుకున్నారని కేసు.. తీర్పు ఇదే

Big Stories

Advertisement
×