E-Paper
Advertisement

అనసూయ వర్కౌట్స్ వీడియో వైరల్.. ఈ సారి ఏకంగా అలాంటి ట్రోల్స్!

అనసూయ వర్కౌట్స్ వీడియో వైరల్.. ఈ సారి ఏకంగా అలాంటి ట్రోల్స్!
Advertisement

Anasuya:న్యూస్ రీడర్ గా తన కెరియర్ మొదలుపెట్టి.. ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో లా స్టూడెంట్ గా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టింది అనసూయ (Anasuya) జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత యాంకర్ గా, గ్లామర్ బ్యూటీగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. బుల్లితెర షోలతో మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్న ఈమె.. సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు షోలు అంటూ ఇన్ని రోజులు అందరినీ ఆకట్టుకున్న అనసూయ .. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో సందడి చేస్తోంది. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా అటు గ్లామర్ ఫోటోస్ తో సందడి చేసే అనసూయ.. తనపై ఎవరైనా నెగిటివ్గా ట్రోల్ చేస్తే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది.

మరో వర్కౌట్ వీడియోతో ఆకట్టుకున్న అనసూయ..

ముఖ్యంగా ఒక వర్గం ఆడియన్స్ ఈమెను పని గట్టుకొని మరి ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ చేస్తున్నారు అనే కామెంట్లు ఎప్పటికప్పుడు వినిపిస్తున్న విషయం తెలిసిందే. విమర్శలకు చోటు ఇవ్వకుండా ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తూ .. తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మరో ఫిట్నెస్ వీడియోని షేర్ చేయడంతో ట్రోలర్స్ మరోసారి రెచ్చిపోయారు. తాజాగా అనసూయ తన ఫిట్నెస్ వీడియోని షేర్ చేస్తూ.. “మరో వారం.. తిరిగి మళ్లీ నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి మరో అవకాశం.. ఇక మొదలు పెడదాం” అంటూ క్యాప్షన్ జోడించింది.

అయినా ఆగని ట్రోల్స్..

Advertisement

ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆంటీల ఉండే అనసూయ అమ్మాయిలా రూపాంతరం చెందింది అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. మరొక నేటిజన్ అమ్మాయిలతో పోటీ పడకండి మీరు ఎప్పటికీ ఆంటీనే అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

also read:ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

అనసూయకు మద్దతుగా ఫ్యాన్స్..

Advertisement

అయితే అనసూయ అభిమానులు మాత్రం ఎప్పటిలాగే ఆమెకు సపోర్టుగా నిలుస్తూ ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఒకరు ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానిని ప్రశంసించడం పోయి హేళన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అనసూయ చాలెంజ్ చేసింది అంటే కచ్చితంగా దానిని నెరవేర్చే తీరుతుంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . మొత్తానికైతే అనసూయ షేర్ చేసిన ఈ వీడియో చాలామందికి ఇన్స్పైర్ గా నిలుస్తోంది అని చెప్పవచ్చు.

 

 

?utm_source=ig_web_copy_link&dlrf=NTc4MTIwNjQ2YQ==

Related News

Illu Illaalu Pillalu Valli : వల్లి అవుట్.. ఇదే ఫైనల్ ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: గుణ పై బాలుకు అనుమానం.. బాలు దెబ్బకు మనోజ్ అవుట్.. శోభాకు వార్నింగ్..

Podarillu Today Episode : నారాయణ స్టోరీతో కన్నీళ్లు.. మాధవ్ మాటతో షాక్.. చక్రీకి అనుమానం..

Karthika Deepam 2 Serial Today Episode October 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: భోజనం చేస్తుటే వెళ్లి గొడవ చేసిన దక్షిణమూర్తి – కోపంతో ఊగిపోయిన శివనారాయణ  

Illu Illalu Pillalu Today Episodes: అమూల్యకు షాక్.. రామరాజు మాటతో సాగర్ ఫైర్.. భద్రకు కన్నీళ్లు..

Brahmamudi Serial Today Episode October 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీ కేసులో మేనేజర్‌ నుంచి రాజు నిజం రాబడతాడా..?  

Intinti Ramayanam Today Episode: పల్లవి రచ్చ.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. అవనికి షాక్..

Big Stories

Advertisement
×