E-Paper
Advertisement

Dragon film: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో RRR బ్యూటీ..

Dragon film: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో RRR బ్యూటీ..
Advertisement

Dragon film: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమానంతరం ఈయన దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో యాక్షన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా గురించి ఇప్పటివరకు చిత్ర బృందం ఏ విధమైనటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు కానీ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. మరి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటించబోతున్న ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే…

ఒలివియా కాథ్లీన్ ఎఫ్. మోరిస్

Advertisement

రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ నటించారు. ఈమెతోపాటు ఒలివియా నటించి సందడి చేశారు . ఎన్టీఆర్ కు జోడిగా నటి ఒలివియా కాథ్లీన్ ఎఫ్. మోరిస్ నటించిన విషయం తెలిసిందే. ఈమె ఈ సినిమాలో జెన్నీ అనే పాత్రలో కనిపించి సందడి చేశారు. ఈ సినిమాలో జెన్ని పాత్రకు ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఒలివియా మరోసారి ఎన్టీఆర్ సినిమాలో కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో  ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం

Advertisement

ఇక డ్రాగన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు . ఇకపోతే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ కాదని ఈ సినిమాకు మరో టైటిల్ కూడా ఉండబోతుందని నిర్మాతలు ఇటీవల వెల్లడించారు .అతి పెద్ద ఈవెంట్ ద్వారా ఈ సినిమా టైటిల్ రివిల్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇలా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో RRR బ్యూటీ కూడా నటించబోతున్నారని నేపథ్యంలో ఈమె ఏ పాత్రలో నటించబోతున్నారు ఏంటి అనే విషయాలపై కూడా అభిమానులు ఆరాతీస్తున్నారు. ఇక ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇప్పటివరకు ప్రశాంత డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: MAD Junior: ‘మ్యాడ్ జూనియర్’ పూజా కార్యక్రమాలు పూర్తి.. స్పీడు మీదున్న నాగ వంశీ!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×