E-Paper
Advertisement

Crime Thriller OTT : 2 గంటల 19 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్… వెన్నులో వణుకు పుట్టించేలా ప్రతి సీన్… IMDbలో 7.5 రేటింగ్‌

Crime Thriller OTT : 2 గంటల 19 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్… వెన్నులో వణుకు పుట్టించేలా ప్రతి సీన్… IMDbలో 7.5 రేటింగ్‌
Advertisement

Crime Thriller OTT : ఆడియన్స్ ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల కోసం పాకులాడుతున్నారు. ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో ఇలాంటి సినిమాలకు కొదవలేదు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత, ఓటీటీలో ఈ సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. ఇక ఇంట్లోనే కూర్చుని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోనర్ సినిమాలను చూసి. అయితే మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ సినిమా చూస్తే మీకు అస్సలు బోర్ అనిపించదు. ఈ 2 గంటల 19 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 83 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీ అభిమానులను కూడా అలరిస్తోంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘కలాంకావల్’ (kalamkaval). ఇది జిష్ణు శ్రీకుమార్‌తో కలిసి స్క్రీన్‌ప్లే రాసిన నూతన దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వం వహించిన సినిమా. ఈ చిత్రాన్ని మమ్ముట్టి నిర్మించారు. ఇక ఇందులో మమ్ముట్టి, వినాయకన్‌లతో, గిబిన్ గోపీనాథ్, గాయత్రి అరుణ్, రజిషా విజయన్, శ్రుతి రామచంద్రన్ నటించారు. ‘కలాంకావల్’ డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన 40 రోజుల తర్వాత 2026 జనవరి 16 నుంచి SonyLIV ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ మలయాళ చిత్రంగా నిలిచింది.

Advertisement

Read Also :  కిల్లర్ ని పరుగులు పెట్టించే హ్యాకర్… బుర్రకు పదును పెట్టే థ్రిల్లర్ మూవీ

స్టోరీలోకి వెళ్తే

ఈ సినిమా త‌మిళ‌నాడు, కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. వీళ్ళంతా మహిళలు కావడంతో కేసు మరింత సంచలనంగా మారుతుంది. ఇక ఈ కేసులో మొదటగా ఓ యువ‌తి మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేడానికి జ‌య‌కృష్ణ‌న్ అనే ఎస్సై రంగంలోకి దిగుతాడు. ఈ కేసు ప‌రిశోధిస్తున్న స‌మ‌యంలో స‌మీప గ్రామాల్లో కూడా అనేక మంది మ‌హిళ‌లు మిస్ట‌రీగా మాయ‌మైన విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. ఇక ఈ హత్యాలన్నీ కేర‌ళ‌, త‌మిళ‌నాడు బార్డర్ లలో జరుగుతుంటాయి. ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా చిక్కుముడి వీడకపోవడంతో స్టాన్లీ దాస్ అనే మ‌రో పోలీస్‌ను సాయంగా తీసుకుంటారు. కిల్లర్ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుంటాడు. చివ‌ర‌కు పోలీసులు నేర‌స్తుడిని ప‌ట్టుకో గ‌లిగారా ? కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సైకో కిల్లర్ పాత్రలో మమ్ముట్టి ఇరగదీశాడానే చెప్పాలి. పోలీస్ గా వినాయకన్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఈ థ్రిల్లర్ క్లైమాక్స్ మాత్రం అందరినీ పిచ్చెక్కిస్తోంది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు.

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×