E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్.. జూన్ నాటికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్.. జూన్ నాటికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు:  సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న ‘‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం’’ పై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్సు డేటా లేక్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టంను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలన్నారు. వచ్చే ఏడాది జూన్‌లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సీఎంం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

జూన్ నాటికి కార్డులు

రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 25 రకాల వివరాలతో పీ4 లాంటి అంశాలను ఆ కార్డులో పొందుపర్చాలన్నారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారంతో ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు. ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, వాక్సినేషన్, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించి పూర్తి ఫ్యామిలీ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు.

Advertisement

Also Read: Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్.. ఆలయానికి 30 ఎకరాల భూమి

ఒక్క కార్డుతో అన్ని వివరాలు

కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో భాగంగా ఫ్యామిలీ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడం, సులభంగా పౌర సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లను ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్‌ అయ్యేలా చూడాలన్నారు. ఈ ఒక్క కార్డుతో అన్ని వివరాలు తెలిసేలా రూపొందించాలని సీఎస్, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×