Divya Bharathi:అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో దివంగత నటి దివ్యభారతి(Divya Bharathi) ఒకరు. 19 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన దివ్యభారతి అకాల మరణం ఇప్పటికీ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి. దివ్యభారతి భవనం పైనుంచి కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే. తన ఇంట్లో కిటికీలో కూర్చున్న ఆమె ఉన్నఫలంగా అయిదవ ఫ్లోర్ నుంచి కింద పడటంతో వెంటనే తనని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అప్పటికే దివ్యభారతి మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇలా చిన్న వయసులోనే దివ్యభారతి మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
భవనం పై నుంచి పడి మరణించిన నటి..
ఇకపోతే తాజాగా దివ్య భారతి గురించి పహ్లాజ్ నిహలానీ(Pahlaj Nihalani) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె మరణం తర్వాత ముందుగా వెళ్లిన వ్యక్తులలో తాను ఒకరని తెలిపారు.దివ్యభారతి నటించిన షోలా ఔర్ షబ్నం(Shola Aur Shabnam) సినిమాకు పహ్లాజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా దివ్యభారతి సినిమాల పట్ల ఎంత కచ్చితంగా ఉంటారనే విషయాల గురించి పహ్లాజ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముందుగా దివ్యభారతిని తనకు జతిన్ పండిట్ పరిచయం చేశారని తెలిపారు. ఆ సమయంలో దివ్య భారతి చాలా బొద్దుగా ఉండడంతో ముందు తనని సన్నబడమని సలహా ఇచ్చాను.
దివ్యభారతి కాలికి గాయం…
దివ్యభారతి తిరిగి సన్నబడి తన వద్దకు వచ్చిన సమయంలో షోలా ఔర్ షబ్నం సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలిపారు. అప్పటికి దివ్యభారతి ఈ సినిమాలో హీరోయిన్గా నటించకపోయిన ఆమె పూర్తిగా సన్నబడి అందంగా ఉండడంతో తిరిగి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసి షూటింగ్ పూర్తి చేశామని పహ్లాజ్ గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఒక పాట చిత్రీకరణ జరపాల్సి ఉంది. అయితే ముందు రోజు దివ్యభారతి కాలికి మేకు గుచ్చుకున్నప్పటికీ ఆమె షూటింగ్లో పాల్గొన్నారని తెలిపారు.
ఛాతీ పై కూర్చుని నిద్రలేపిన నటి..
ఇక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తన కాలికి గాయం కావడంతో ఉదయం షూటింగ్ క్యాన్సిల్ చేసాము. అయితే ఆరోజు రాత్రి నేను నా భార్యతో కలిసి నిద్రపోతున్న సమయంలో ఆమె నా గదిలోకి వచ్చి, హౌస్ కీపింగ్ ద్వారా తలుపు తెరిచి, నా ఛాతీపై కూర్చుని నన్ను నిద్ర లేపుతున్నారు. ఆ సమయంలో నా భార్య ఈ అమ్మాయి ఎవరు అంటూ ఆశ్చర్యపోయిందని అప్పటి సంఘటనలను ఈ సందర్భంగా పహ్లాజ్ గుర్తు చేసుకుని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. తనకు ఇబ్బంది కలిగిన షూటింగ్లో పాల్గొనడం కోసం ఏకంగా నిర్మాత గదికి వెళ్లి మరి తనని నిద్ర లేపారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాల పట్ల ఇలా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న దివ్యభారతి అకాల మరణాన్ని ఇప్పటికి కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!