Shivam Shaivam Movie:ఈమధ్య కాలంలో పండుగ దినాలను దృష్టిలో పెట్టుకొని అటు సెలబ్రిటీలు కూడా తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను, పాటలను, విడుదల తేదీలను రిలీజ్ చేస్తూ అభిమానులలో హైప్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కొత్త సినిమా పోస్టర్ విడుదలయ్యింది. ప్రముఖ డైరెక్టర్ వీర శంకర్ (Veera Shankar) చేతులమీదుగా ‘శివం శైవం’ అనే మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. అమ్మా క్రియేషన్స్ బ్యానర్లో సాయి శ్రీనివాస్ MK (Sai Srinivas MK) స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శివం శైవం. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ తో పాటు కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా ప్రముఖ డైరెక్టర్ వీరశంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
శివం శైవం ఒక మంచి కాన్సెప్ట్ – డైరెక్టర్ వీర శంకర్
దినేష్ కుమార్, అన్షు పొన్నచేన్, రాజశేఖర్, జయంత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి క్రాంతికుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుతపల్లి రామలక్ష్మి లిరిక్స్ అందిస్తూ ఉండగా.. నిమిషి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ.. “శివం శైవం అనే మూవీని మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. టీం సభ్యులందరికీ మంచి పేరు రావాలని ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.
మైథాలజీ జోనర్ లో శివం శైవం మూవీ..
ఈ చిత్రం నిర్మాత, డైరెక్టర్ సాయి శ్రీనివాస్ MK మాట్లాడుతూ.. “మేము అడిగిన వెంటనే మా సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయడానికి వచ్చిన డైరెక్టర్ వీర శంకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాము. గ్రామీణ నేపథ్యంలో మైథాలజీ జోనర్ లో ఈ సినిమా రాబోతోంది. మా టీమ్ మెంబర్స్ ఎంతో కష్టపడి, ఇష్టపడి ఈ సినిమాను చేస్తున్నారు. సాంగ్స్ , నేపథ్యం, సంగీతం సినిమాకి చాలా సపోర్ట్ గా నిలిచాయి. ప్రతి ఒక్కరూ మా సినిమాకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అంటూ ఆయన తెలిపారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ALSO READ:Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?