Ganesh Chaturthi Song:సాధారణంగా ఏదైనా పండుగ వచ్చింది అంటే.. ఆ పండుగకు సంబంధించిన స్పెషల్ ఆర్టికల్స్ ఎప్పటికప్పుడు దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అటు ప్రజలు కూడా ఆ పండుగకు సంబంధించిన పలు విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. ఇకపోతే రేపు (ఆగస్టు 27)ఆది దేవుడి పుట్టినరోజు.. ఆదిదేవుడు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మహాగణపతి. కార్యం ఏదైనా సరే తొలి పూజ అందుకుంటూ విజ్ఞాలను తొలగిస్తూ విఘ్నేశ్వరుడిగా పేరు సొంతం చేసుకున్న గణేష్ చతుర్థి రేపు.. ఈ సందర్భంగా గణేష్ చతుర్ధికి సంబంధించిన స్పెషల్ స్టోరీలు, పాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే వినాయకుడిపై ఉన్న భక్తిని చాటుకుంటూ ఆయన పైన వచ్చిన పాటలను ప్రజలు కూడా నెమరు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పాటలు వినడానికి వినసొంపుగా ఉండడమే కాకుండా దైవత్వాన్ని కూడా నింపుతున్నాయి. మరి ఈ వినాయక చతుర్థి స్పెషల్ స్టోరీలో భాగంగా అందరి దృష్టిని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది “వక్రతుండా మహాకాయా” సాంగ్..
వినాయక చవితి స్పెషల్ ఫోకస్..
ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో 2000సంవత్సరంలో విడుదలైన తెలుగు భాషా అతీంద్రియ చిత్రం దేవుళ్ళు. పృథ్వీ, రాసి, మాస్టర్ నందన్, బేబీ నిత్య, సుమన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రమ్యకృష్ణ, లయ తదితరులు కీలక పాత్రల్లో పోషించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. బాబు పిక్చర్స్ బ్యానర్ పై చేగొండి హరిబాబు, కరాటం రాంబాబు నిర్మించారు. ముఖ్యంగా విడిపోయిన అమ్మానాన్నలను కలిపే ప్రయత్నంలో పిల్లలు చేసే పోరాటమే ఈ దేవుళ్ళు సినిమా. తల్లిదండ్రుల ప్రేమ కోసం పిల్లలు పడే ఆరాటం ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు కోడి రామకృష్ణ. దీనికి తోడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubramaniam), చిత్ర (KS Chitra), సుజాత (Sujatha), జానకి (Janaki) లాంటి దిగ్గజ గాయని గాయకులు ఆలపించిన పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
ఈ పాటతో దైవత్వాన్ని నింపిన రచయితలు..
ఇకపోతే ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలు ఉండగా అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పవచ్చు. ఇక మొదటిగా వచ్చే పాట “వక్రతుండా మహాకాయ”.. దిగ్గజ సంగీత దర్శకులు, గాయకులు అయినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ పాటను ఆలపించడమే కాకుండా ఈ పాటకు తన గొంతుకతో జీవం పోశారు అని చెప్పవచ్చు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా.. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు సాహిత్యం అందించిన ఈ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ వినాయక చవితి సందర్భంగా ఈ వక్రతుండా మహాకాయ పాటను మీకోసం మరొకసారి అందించే ప్రయత్నం చేస్తున్నాము..
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ!
నిర్విఘ్నం కురు మే దేవా సర్వకారేషు సర్వదా!!
ఓ వంకర తొండము కలిగినవాడా.. కోటి సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడా .. దయచేసి నా పనులన్నింటినీ ఎల్లప్పుడూ ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయి.. అని అర్థం వచ్చేలా ఈ పాట సాహిత్యాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు.
ALSO READ:Shivam Shaivam Movie: డైరెక్టర్ చేతుల మీదుగా శివం శైవం పోస్టర్ రిలీజ్.. ఎలా ఉందంటే?