BigTV English

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

Make Money With D-Mart: ఇతర సూపర్ మార్కెట్లో పోల్చితే డిమార్ట్ లో తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులను పొందే అవకాశం ఉంటుంది. నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వస్తువులను కొనుగోలు చేసి, వినియోగదారులకు చీప్ గా అందిస్తాయి. అందుకే, చాలా మంది వినియోగదారులు డిమార్ట్ లో షాపింగ్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది. డిమార్ట్ తో కలిసి మనమూ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. డిమార్ట్ తో డబ్బులు ఎలా సంపాదించవచ్చు? అని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ స్టోరీ తప్పకుండా తెలుసుకోవాల్సిందే..


డిమార్ట్ తో వ్యాపారం చెయ్యొచ్చు!

చాలా మంది స్థానికులు డిమార్ట్ తో కలిసి వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కూడా నాణ్యమైన వస్తువులు తయారు చేస్తే, డిమార్ట్ తో లింక్ కావచ్చు. ఇంట్లో తయారు చేసిన స్వీట్లు, ఊరగాయలు, వస్త్రాలు, గృహాలంకరణలు డిమార్ట్ తో కలిసి అమ్ముకునే అవకాశం ఉంటుంది. మీ ప్రొడక్టులు డిమార్ట్ యాజమాన్యానికి నచ్చితే, మీ ఉత్పత్తులను వారి స్టోర్ లో అమ్మేందుకు అంగీకారం చెప్తారు. డిమార్ట్ మీ వస్తువులను అమ్ముకోవచ్చు. ఆయా వస్తువులను డిమార్ట్ కొనుగోలు చేసి అమ్ముతుంది. మీకు డబ్బులు అందిస్తుంది. అయితే, డిమార్ట్ మీకు లాభానికి సంబంధించిన మార్జిన్ తక్కువగా ఇచ్చినప్పటికీ, ఎక్కువ మొత్తంలో అమ్మకాలు ఉండటం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.


డిమార్ట్ తో కలిసి ఎలా పని చేయాలి?

ఒకవేళ మీరు డిమార్ట్ తో కలిసి పని చేయాలనుకుంటే వారి అధికారిక వెబ్ సైట్ లో చిన్న భాగస్వామ్య ఫారమ్‌ ఫిల్ చేసి సబ్ మిట్ చేయాలి. ఇందుకోసం www.dmartindia.comను ఓపెన్ చేయాలి. మీ ఫారమ్ ఫిల్ చేసిన పంపిన తర్వాత స్టోర్  బృందం ప్రతి మంగళవారం సమావేశం నిర్వహిస్తుంది. ఈ మీటింగ్ లో ధర, మార్జిన్‌ లను ఖరారు చేస్తుంది.

డిమార్ట్ నుంచి రెంట్ పొందవచ్చు!

డిమార్ట్ కు ఉత్పత్తులను సరఫరా చేసి డబ్బులు సంపాదించడమే కాదు. మరో మార్గం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. డిమార్ట్ ఎప్పటికప్పుడు తన నెట్ వర్క్ ను విస్తరిస్తోంది. దేశం అంతటా స్టోర్లు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 70కి పైగా నగరాలలో స్టోర్లు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కొత్త ప్రదేశాలో స్టోర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒకవేళ మీ దగ్గర పెద్ద షాపింగ్ ప్లేస్ అందుబాటులో ఉంటే డిమార్ట్ కు లీజుకు ఇవ్వొచ్చు. డిమార్ట్ వెబ్ సైట్ ద్వారా ఫారమ్ నింపి సబ్ మిట్ చేస్తే మీ ప్రాపర్టీని అద్దెకు తీసుకుంటుంది.

డిమార్ట్ లో అమ్ముడవుతున్న స్థానిక ఉత్పత్తులు

ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులను డిమార్డ్ తన స్టోర్ లో అమ్ముతుంది. కాకినాడ స్వీట్లు, ఆత్రేయపురం పూతరేకులు, ఊరగాయలు, బట్టలు, హస్తకళలును అమ్ముతుంది. స్థానికులు వ్యాపారాలు మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి ఇది సహాయపడుతుంది.

Read Also: ఆ వస్తువులు సగం ధరలకే, డిమార్ట్ వినాయక చవితి బంపర్ ఆఫర్!

Related News

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Gold Rates Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే కానుకలపై టాక్స్ ఉంటుందా..ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి..

Big Stories

×