Chiranjeevi Cameo in OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వచ్చని చిత్రం ‘హరి హర వీరమల్లు’. రిలీజ్‌కు ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ తర్వాత హరి హర వీరమల్లు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఇండస్ట్రీలో హిట్ కొడుతుందని ఫ్యాన్స్, మూవీ టీం ఆశపడింది. కానీ, కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. హరి హర వీరమల్లు మూవీ నిరాశ పరచడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఓజీ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఓజీ మరో మెగా హీరో
ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్‌ని కూడా జరుపుకుంటోంది. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా ఓజీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రానుంది. ఇందులో నుంచి బ్యూటీఫుల్ మెలోడీ పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ఇటీవల ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మరో మెగా హీరో నటిస్తున్నారట. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఓజీ ఆయన కామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఓజీ పవన్ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్‌కి పూనకాలే అన్నట్టు ఉంది. ఇక ఇందులో మెగాస్టార్ కూడా భాగం అయితే.. ఇక థియేటర్లు దద్దరవ్వాల్సిందే. కాగా గతంలో ఈ మెగా బ్రదర్స్ ఒకేసారి బిగ్ స్క్రీన్‌పై కనిపించిన సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో పవన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు తమ్ముడి కోసం మెగాస్టార్ ఓజీలో మెరవనున్నారు. కొన్ని క్షణాల పాటు చిరు ఓజీ సందడి చేయనున్నారు. మరోవైపు ఓజీ చిత్రంతోనే పవన్ తనయుడు అకిరా నందన్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని ముందు నుంచి ఓ వార్త ప్రచారంలో ఉంది.
అకిరా గ్రాండ్ ఎంట్రీ
ఇందులో పవన్ టీనేజ్ వయసులో అకిరా కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతొన్న ఈ చిత్రంలో అకిరా కటౌట్ ఈ పాత్రకు బాగా సూట్ అవుతుందని, టీనేజ్ పవన్ అకిరా లుక్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని ఈ సినిమా పవర్ స్టార్ తనయుడిని తీసుకుంటున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఓజీ బ్లాక్‌బస్టర్ ఖాయం అయినట్టే అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, చిరు.. ఇటూ అకిరా..ఇలా ముగ్గురు మెగా హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే.. అభిమానులకు కనుల పండుగే అవుతుందనడంలో సందేహం లేదు. అయితే మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి ప్రకటన వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే. కాగా సాహో ఫేం, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంతోనే అతడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్ నటులు సైతం ఓజీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.