BigTV English

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Jammu Kashmir: జమ్ముకశ్మీర్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వైష్ణోదేవీ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. సంఘటనా స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.


జమ్ముకశ్మీర్ లో కుండపోత వానలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్ానయి. ఆకస్మిక వరదల కారణంగా పలు చోట్లు వందల ఇల్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే జమ్ము ప్రాంతంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. జమ్మూలో తావి నది ఉప్పొంగుతోంది. ఈక్రమంలోనే అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు.  కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబన్ కిష్త్వార్ జిల్లాలతో సహా జమ్మూ ప్రాంతంలోని అనేక ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కొండచరియలు విరిగిపడటం, రాళ్లు విరిగిపడటం వంటి కారణాల వల్ల ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. రేపటి వరకు ఎత్తైన ప్రాంతాలలో మేఘావృతాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాలలో రెస్క్యూ, రిలీఫ్ బృందాలను అధికారులు అప్రమత్తంగా ఉంచారు.  గత వారం రోజుల్లో జమ్మూలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.


గడిచిన 24 గంటల్లో జమ్ముకశ్మీర్ ప్రాంతంలో 190.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది శతాబ్దంలో ఆగస్టు నెలలో రెండవ అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. ఆగస్టు 5, 1926న అత్యధిక వర్షపాతం 228.6 మి.మీ నమోదైందని చెప్పారు. రెండో అత్యధిక వర్షపాతం ఆగస్టు 11, 2022న 189.6 మి.మీ. నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ALSO READ: Nalgonda News: ఖరీదైన కార్లలో మేకలు, గొర్రెల దొంగతనం.. 16 మంది అరెస్ట్

Related News

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Mahabubnagar Incident: రెబీస్ భయం.. కూతురిని చంపి, తల్లి ఆత్మహత్య.. బోర్డు మీద రాసి మరీ..

Big Stories

×