BigTV English

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోందిగా!

Bahubali The Epic Teaser: ఇటీవల కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అయితే రీ రిలీజ్ విషయంలో కూడా రాజమౌళి మరో అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యారని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే పది సంవత్సరాల క్రితం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) రానా(Rana) ప్రధాన పాత్రలలో నటించిన బాహుబలి(Bahubali) సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా పేరు ప్రఖ్యాతలను ఉన్నత శిఖరాలకు చేర్చింది.


రీ రిలీజ్ లో ట్రెండ్ సెట్ చేయబోతున్న జక్కన్న..

ఇక ఈ సినిమా విడుదల అయ్యి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)అనే పేరిట ఓకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్..

ఈ టీజర్ వీడియో 1:18 సెకండ్ల నిడివితో ఉంది అయితే ఇందులో బాహుబలి1, బాహుబలి 2 కి సంబంధించిన సన్నివేశాలను చూయించారని చెప్పాలి ఇందులో భాగంగా అమరేంద్ర బాహుబలి పుట్టడం, కట్టప్ప బాహుబలిని చంపడం, రానాతో ప్రభాస్ ఫైట్ సన్నివేశాలను కూడా అద్భుతంగా చూపించారు. ఇలా ఈ టీజర్ వీడియో చూస్తుంటే ప్రేక్షకులలో ఏదో తెలియని సరికొత్త అనుభూతి కలుగుతుందని చెప్పాలి. ఇలా బాహుబలి ది ఎపిక్ సినిమాతో రాజమౌళి మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. 10 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పాలి.

?igsh=MXBqMGNldXYwdTdnZQ%3D%3D

ఇలా రీ రిలీజ్ విషయంలో కూడా జక్కన్న తన మార్క్ ఏంటో నిరూపించుకోబోతున్నారు.. ఇక ఈ సినిమా ఎంతోమంది నటీనటుల సినీ జీవితాన్ని కీలక మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి కూడా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమా షూటింగ్ తో పాటు బాహుబలి ది ఎపిక్ పనులలో కూడా రాజమౌళి ఎంతో బిజీగా గడుపుతున్నారు. మరి అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Boney Kapoor: శ్రీదేవి ఇంటికోసం కోర్టు మెట్లు ఎక్కిన బోణి కపూర్.. అసలేం జరిగిందంటే?

Related News

Trolls on Allu Arjun: అయ్యో! అల్లు అర్జున్‌కు ఎంత అవమానం..

Divya Bharathi: దివ్య భారతి నా రూమ్‌లోకి వచ్చి.. నా ఛాతి మీద కూర్చొంది.. నా భార్య షాకైంది!

Telugu Producer : అప్పుల్లో బడా నిర్మాత… జీతాలు కూడా ఇవ్వడం లేదు ?

Ayesha Khan: ఏంటీ.. అయోషా ఖాన్‌ పెళ్లి చేసుకుందా!.. బ్రైడల్‌ లుక్‌లో హాట్‌ బ్యూటీ, ఫోటోలు వైరల్‌

Boney Kapoor: శ్రీదేవి ఇంటికోసం కోర్టు మెట్లు ఎక్కిన బోణి కపూర్.. అసలేం జరిగిందంటే?

Big Stories

×