Vv Vinayak : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే కచ్చితంగా వినిపించే పేరు వివి వినాయక్. తన మొదటి సినిమా ఆదితోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. ఎన్టీఆర్ తో అద్భుతమైన రికార్డ్స్ కొట్టాడు. వివి వినాయక్ సినిమాలు అంటేనే ప్రత్యేకం. ఇప్పుడు అంతా కమర్షియల్ సినిమాలు యాక్షన్ ఫిలిమ్స్ అని మాట్లాడుతారు. ఒకప్పుడు వివి వినాయక్ చూపించిన యాక్షన్ తెలుగులో ఇంకో దర్శకుడు చూపించలేదు. గాల్లో సుమోలు రావడం వినాయక్ సినిమాల్లో ప్రత్యేకంగా గమనించవచ్చు.
వినయ్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా అప్పట్లో ఒక సంచలనం. మెగాస్టార్ రీ ఎంట్రీ కోసం కూడా వివి వినాయక్ కు అవకాశం దొరికింది. ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అయితే వివి వినాయక్ హీరోగా సీనయ్య అనే సినిమా కూడా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
మరోసారి మెగా ఫోన్
అయితే రీసెంట్ టైమ్స్ లో వివి వినాయక్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. అఖిల్, ఇంటిలిజెంట్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఇప్పుడు వివి వినాయక్ మళ్లీ డైరెక్షన్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా వివి వినాయక్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కథ చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో పూజ స్టార్ట్ కానున్నట్లు విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో లక్ష్మి సినిమా వచ్చింది. అప్పట్లో సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
కం బ్యాక్ ఇస్తారా?
వివి వినాయక్ తన మార్క్ యాక్షన్ ఫిలిం చేసి చాలా రోజులు అయిపోయింది. అయితే ఇప్పుడు వెంకటేష్ (Venkatesh) తో చేయబోయే సినిమాతో కం బ్యాక్ ఇస్తారు అని చాలామంది అనుకుంటున్నారు. పూరి జగన్నాథ్, వివి వినాయక్ వంటి దర్శకుల కంబ్యాక్ కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. వివి వినాయక్ వెంకటేష్ తో చేయబోయే సినిమా సక్సెస్ అయితే మళ్లీ అవకాశాలు వినాయకుని వెతుక్కుంటూ వస్తాయని చెప్పొచ్చు.
Also Read: దివ్య భారతి నా రూమ్‌లోకి వచ్చి.. నా ఛాతి మీద కూర్చొంది.. నా భార్య షాకైంది!