Alia Bhatt: అలియా భట్(Alia Bhatt) బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న అలియా భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా అలియా భట్ మీడియాపై కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇకపోతే అలియా భట్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే..
అనుమతి లేకుండా ఎలా తీస్తారు?
ఇటీవల అలియా భట్ రణబీర్(Ranbir Kapoor) దంపతుల కొత్త ఇంటికి (New House) సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సుమారు 6 అంతస్తులలో 250 కోట్ల రూపాయల ఖరీదైన ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ విషయంపై అలియా భట్ స్పందిస్తూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ..” ముంబై లాంటి ఒక మహానగరంలో పరిమిత స్థలాలు ఉన్నప్పుడు.. కొన్నిసార్లు ఇతరుల ఇంటి కిటికీ నుంచి మరొక వ్యక్తి ఇల్లు ఎలా ఉంటుందో చూసే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను అలా చూడటానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంది. అయితే ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదని తెలిపారు”.
అనుమతి లేకుండా ఫోటోలు తీయడం సరైనది కాదు..
“ప్రస్తుతం ముంబైలో నిర్మాణ దశలో ఉన్న మా ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మా అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇది భద్రత సమస్యకు నిలువెత్తు నిదర్శనంగా కనపడుతుంది. అనుమతి లేకుండా ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటోలను లేదా వారి వ్యక్తిగత విషయాలను చిత్రీకరించి ఫోటోలు తీయడం నిజమైన కంటెంట్ కాదు ఇది వారి స్వేచ్ఛను ఉల్లంఘించినట్టేనని, ఇలాంటి చర్యలను చూసి చూడనట్టు వదిలిపెట్టకూడదని” ఆలియా భట్ తెలిపారు.
“ఇలాగే మీ ఇంటి లోపల వీడియోలను తీసి వాటిని బహిరంగంగా షేర్ చేయడానికి మీరు ఒప్పుకుంటారా? ఒకసారి ఆలోచించండి మనకు తెలియకుండానే ఎవరూ కూడా ఈ విషయాన్ని సహించరు కాబట్టి మా ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను కనుక మీరు చూసినట్లయితే దయచేసి వాటిని షేర్ చేయొద్దని ఈ సందర్భంగా అందరినీ కోరారు. అలాగే ఇంటికి సంబంధించిన ఫోటోలు ,వీడియోలు పోస్ట్ చేసిన మీడియా మిత్రులకు వెంటనే వాటిని తొలగించమని ఈ సందర్భంగా కోరుతున్నాను” అంటూ అలియా భట్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే గతంలో కూడా అలియా భట్ తన కుమార్తెతో ఇంట్లో ఆడుకుంటూ ఉన్న ఫోటోలు వీడియోలను ఎదురుగా ఉన్న ఇంటి నుంచి షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పుడు కూడా ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి తన ఇంటి ఫోటోలు వైరల్ గా మారడంతో ఆలియా స్పందిస్తూ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.
Also Read: Divya Bharathi: దివ్య భారతి నా రూమ్‌లోకి వచ్చి.. నా ఛాతి మీద కూర్చొంది.. నా భార్య షాకైంది!