Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజి. సాహో సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను రీమేక్ చేయడానికి సుజిత్ కి పిలుపు వచ్చింది. పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికంటే ముందు ఏమైనా కథ ఉందా అని నన్ను అడిగితే బాగుంటుంది అని అనుకున్నాడు సుజిత్.
అదృష్టవశాత్తు సుజిత్ కి అదే ప్రశ్న ఎదురైంది. వెంటనే సుజిత్ తన దగ్గర ఉన్న లైన్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి విపరీతంగా నచ్చేసింది. అదే ఓజి సినిమాగా రూపుదిద్దుకుంటుంది. దర్శకుడు సుజిత్ స్వతహాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అలానే సుజిత్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమాను అనౌన్స్ చేసిన వెంటనే సాహూ తన బెస్ట్ వర్క్ అంటూ బీభత్సమైన ఎలివేషన్స్ సుజిత్ కి ఇచ్చారు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
ఆ ఏరియా థియేటర్స్ అన్ని ఓజి కే అంకితం
కొన్ని సినిమాలను కొన్ని థియేటర్స్ లో చూస్తే విపరీతమైన హై వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో చూడడానికి చాలామంది అభిమానులు ఇష్టపడతారు. సంధ్య థియేటర్ అంటే చాలామందికి ఒక ప్రత్యేకమైన పర్సనల్ ఎమోషన్. అందుకే చాలామంది రీ రిలీజ్ సినిమాలు అక్కడ చూడటానికి ఇష్టపడతారు. ఇక పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏకంగా 6 థియేటర్లను కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్న సింగిల్ స్క్రీన్స్ లో పవన్ కళ్యాణ్ బొమ్మ పడుతుందంటే ఆ ఏరియా అంతా మళ్లీ కి కిటకిటలాడబోతుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు.
మిగతా సినిమాలు తప్పుకోవాల్సిందే
ఖచ్చితంగా ఓ జి సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అలానే ఓ జి సినిమా యూనిట్ కూడా ప్రతిసారి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో పోస్టర్స్ వదులుతూనే ఉంది. సినిమా నుంచి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా దాంట్లో రిలీజ్ డేట్ అయితే మిస్ అవ్వట్లేదు. ఓ జి సినిమాకి పోటీగా మరో సినిమా వచ్చిందే అంటే, ఆ సినిమాకి కొంచెం రిస్క్ అనే చెప్పాలి. థియేటర్స్ ఎక్కువ శాతం ఓ జి సినిమాకి కేటాయిస్తున్నారు. అందరూ కూడా ఓ జి సినిమా ధ్యాసలోనే ఉన్నారు. ఆ తరుణంలో ఏ సినిమా వచ్చినా కూడా అది ఒక సైలెంట్ గా పక్కకెళ్ళిపోతుంది. అయితే సరైన థియేటర్స్ ఈ సినిమాకి దొరుకుతున్నాయి. కంటెంట్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి రుజువు అవుతుంది.
Also Read: Vv Vinayak : మళ్లీ మెగా ఫోన్ పట్టనున్న స్టార్ డైరెక్టర్, ఆ హీరోతో చర్చలు. అక్టోబర్ లో పూజ