Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఏం చేసినా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇలా క్రికెట్ రంగంలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ తాజాగా ఒక సినిమా గురించి మాట్లాడటంతో ఆ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇలా సచిన్ టెండుల్కర్ సినిమాల గురించి మాట్లాడటమే విశేషం అలాంటిది ఒక సినిమా నచ్చిందని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. మరి సచిన్ టెండూల్కర్ ను అంతలా ఆకట్టుకున్న ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేదో కాదు ఇటీవల హీరో సిద్దార్థ్ (Siddarth)నటించిన 3BHK సినిమా (3BHK Movie)అని చెప్పాలి.
3BHK చూస్తూ ఎంజాయ్ చేసిన సచిన్..
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సచిన్ టెండూల్కర్ అస్క్ మీ ఎనీథింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా ఒక అభిమాని సచిన్ టెండూల్కర్ ను ప్రశ్నిస్తూ మీకు సినిమాలు చూసే అలవాటు ఉందా అంటూ ప్రశ్న వేశారు సచిన్ టెండూల్కర్ సినిమాలు చూస్తానని ఇటీవల తాను 3BHK సినిమా చూశాను, ఈ సినిమా చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేశానని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సదరు అభిమాని 3BHK చిత్ర బృందానికి ట్యాగ్ చేశారు. దీంతో సినిమా దర్శకుడు శ్రీ గణేష్(Sri Ganesh) స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా సచిన్ టెండూల్కర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సచిన్ పోస్టుతో ట్రెండింగ్ లో 3BHK..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారికి మా సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది మీరు మా చిన్నప్పటి హీరో సర్. మా సినిమా పట్ల మీరు కురిపించిన ప్రశంసలు మాకు ఎంతో ప్రత్యేకం అంటూ తన సంతోషాన్ని డైరెక్టర్ వ్యక్తం చేశారు. ఇలా సచిన్ టెండూల్కర్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ సినిమా ఆకట్టుకుంద అనే విషయం తెలియడంతో మరోసారి 3 బీహెచ్ కే సినిమా ట్రెండింగ్ లో వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటుంది.
Thank you for sharing Santhosh ☺️❤️
Thank you very much @sachin_rt sir ☺️❤️❤️ You are our Childhood Hero❣️ This means a lot to our Film. #3BHK https://t.co/nekiZyp8Zy
— Sri Ganesh (@sri_sriganesh89) August 25, 2025
సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో దేవయాని (Devayani)సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) హీరో తల్లి తండ్రుల పాత్రలలో నటించారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం కోసం ఎన్ని కష్టాలను అనుభవిస్తారనే విషయాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇలా ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇంటి కలను ఎలా నెరవేర్చుకున్నారనే నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకు ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంశలు లభించాయి. తాజాగా సచిన్ టెండూల్కర్ సైతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై హీరో సిద్దార్థ్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Alia Bhatt: మీ ఇంట్లో ఇలా చేస్తే ఊరుకుంటారా… ఓ రేంజ్ లో ఫైర్ అయిన అలియా!