Trolls On Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ప్రత్యేకమైన శైలి. తన లుక్ నుంచి స్టైల్ వరకు తనకంటూ స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటాడు. సినిమా సినిమాకి మేకోవర్ అవుతూ.. ట్రేండ్ సెట్ చేస్తుంటారు. అందుకే టాలీవుడ్‌లో ఆయన స్టైలిష్ స్టార్ అయ్యాడు. ఇక పుష్ప మూవీతో ఐకాన్ స్టార్‌గా మారాడు. ఈ చిత్రంలో బన్నీ ఇదివరకు ఎన్నడు చూడని మాస్ అవతార్‌లో కనిపించాడు. పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో కనిపించాడు. కర్టీ హెయిర్, మాసిన గడ్డం.. ట్యానింగ్ స్కిన్‌తో డీగ్లామర్‌గా కనిపించి షాకిచ్చాడు. కానీ,ఇందులో బన్నీ తనకంటూ ప్రత్యేకమైన శైలిని చూపించాడు.
ఆదిమానవుడిలా అల్లు అర్జున్..
తగ్గేదే లే అంటూ మాస్‌లో లుక్క్‌లోనూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. అలాంటి ఈ స్టైలిష్ స్టార్‌కి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన లుక్‌పై ట్రోల్ చేస్తూ హోర అవమాన పరిచారు. ఆదిమానవుడిలా అల్లు అర్జున్ ఫేస్‌ని ఎడిట్ చేసి యాంటి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేల సంవత్సరాల క్రితం నాటి మానవుల అస్తిపంజరాల ఫోటోలకు అల్లు అర్జున్ ఫేస్‌ని ఎడిట్ చేశారు. వీటిని “డీఎన్‌ఏ(DNA)అధ్యయనంలో మానవులు దాదాపు 800,000 లక్షల సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యారు. వారిలో1,280 మంది భూమిని తిరిగి జనాభాలోకి చేర్చారు” అంటూ బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ కి ఘోర అవమానం
ఆదిమానవుడిలా అల్లు అర్జున్ పోలుస్తూ యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్దం జరుగుంది. మరి ఈ ట్రోల్స్, వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి? కాగా విడుదల తర్వాత పుష్ప చిత్రాలు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. భారీ వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీసునే షేక్ చేసింది. ఇండియన్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాతో బన్నీ నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతడి మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు.
Also Read: Ayesha Khan: ఏంటీ.. అయోషా ఖాన్ పెళ్లి చేసుకుందా!.. బ్రైడల్ లుక్‌లో హాట్ బ్యూటీ, ఫోటోలు వైరల్
ఈ ప్రాజెక్ట్ బన్నీ హాలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ని పెంచుకునేందుకు సిద్దమవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ ఏకంగా హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో టై అప్ అయ్యాడు. AA22xA6 మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్ కంపెనీ పని చేయబోతోంది. దీనిపై ఇటీవల మూవీ టీం అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఈ దెబ్బతో అల్లు అర్జున్ మార్కెట్ గ్లోబల్ రేంజ్ లో దూసుకుపోతుందనడంలో సందేహం లేదు. లేట్ అయినా బన్నీ గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. దీంతో ఈ మూవీపై ప్రస్తుతం విపరీతమైన బజ్ నెలకొంది. మొన్నటి వరకు రాజమౌళి SSMB29పై ఏ రేంజ్ లో బజ్ ఉందో.. ఇప్పుడు అట్లీ-బన్నీ సినిమాకు అదే స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యింది.
DNA study reveals humans nearly vanished 800,000 years ago with 1,280 people repopulating Earth. pic.twitter.com/FHdm8umUwz
— Globe Eye News (@GlobeEyeNews) August 25, 2025