E-Paper
Advertisement

Dhurandhar 2: ధురంధర్ దెబ్బకు పాకిస్థాన్ ప్రజలు విలవిల.. వీడియో చూస్తే నవ్వు ఆగదు భయ్యా!

Dhurandhar 2: ధురంధర్ దెబ్బకు పాకిస్థాన్ ప్రజలు విలవిల.. వీడియో చూస్తే నవ్వు ఆగదు భయ్యా!
Advertisement

Dhurandhar 2: ధురంధర్.. గత ఏడాది డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా.. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసింది.ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమాకి కొనసాగింపుగా ధురంధర్: ది రివేంజ్ మార్చి 19న ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇది కూడా వరుసగా కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. కేవలం మూడో రోజులోనే 750 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది.

పాకిస్థాన్ పై ధురంధర్ ప్రభావం..

ఇదిలా ఉండగా ఈ సినిమాను దాదాపుగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రభావం పక్క శత్రు దేశమైన పాకిస్థాన్ పై పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు ఈ సినిమా చూసిన తర్వాత అక్కడ పాకిస్థాన్ అధికారులు చేపట్టిన గాలింపు చూస్తే మాత్రం నవ్వు ఆగడం లేదు. పైగా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భయంతో వణికిపోతూ..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ధురంధర్ సినిమాలో పాకిస్థాన్ లో ఇండియన్ స్కై లు ఉన్నట్టు చూపించినట్టుగానే.. ఇప్పుడు పాకిస్థాన్ లో నిజంగానే ఇండియన్ స్పైలు ఉన్నారేమో అనే అనుమానం ఇప్పుడు అక్కడి ప్రజలలోనే కాదు అధికారులలో కూడా బలంగా నాటుకుపోయింది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు మీద పడుకున్నా లేదా అనుమానాధాస్పదంగా కనిపించినా సరే వాళ్లను తీసుకెళ్లి తనిఖీ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ల్యారీ నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే ఇది నిజమా లేదా పుకారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మాత్రం నిజం అనే చెప్పాలి. అందులో పోలీసులు రోడ్డు పక్కన పడుకొని ఉన్న ఒక వ్యక్తిని లేపి మరీ అతడి గురించి ఆరా తీయడం మనం చూడవచ్చు. ఏది ఏమైనా పాకిస్తాన్లో ఇండియన్ సినిమా ప్రభావం గట్టిగానే పడిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Actress Bhanupriya: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ హీరోయిన్ భానుప్రియకి మాతృవియోగం!

నెట్ ఫ్లిక్స్ లో భారీ వ్యూస్..

Advertisement

ఇకపోతే ధురంధర్ చిత్రాన్ని పాకిస్థాన్ అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలలో విడుదల కానివ్వకుండా బ్యాన్ చేశారు కదా ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్కడి ప్రజలు ఎలా చూశారు అనే అనుమానం అందరిలో కలగవచ్చు. కానీ ఇది అక్కడ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రానికి రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ వ్యూస్లో అత్యధిక శాతం పాకిస్థాన్ దేశం నుండే రావడం గమనార్హం. పైగా అక్కడ ఈ చిత్రం అనేక రోజులు అద్భుతమైన వ్యూస్ తో ట్రెండ్ అయింది. అందుకే ఈ సినిమా ప్రభావం అక్కడి వాళ్లపై భారీగా పడిందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×