E-Paper
Advertisement

Actress Bhanupriya: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ హీరోయిన్ భానుప్రియకి మాతృవియోగం!

Actress Bhanupriya: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ హీరోయిన్ భానుప్రియకి మాతృవియోగం!
Advertisement

Actress Bhanupriya:చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలనాటి తార స్టార్ సీనియర్ హీరోయిన్ భానుప్రియ (Bhanupriya) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. భానుప్రియ తల్లి ఎం.లక్ష్మి(M.Lakshmi ) (83) ఆదివారం రోజు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఇకపోతే భానుప్రియ తల్లి ఆదివారం మరణించినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎం లక్ష్మికి భానుప్రియ తో పాటు మరో హీరోయిన్ శాంతిప్రియ అలాగే గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరూ కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. ఇక ఆమె మరణాన్ని భానుప్రియ, శాంతిప్రియ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భానుప్రియ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు.

భానుప్రియ వ్యక్తిగత జీవితం..

ప్రముఖ సీనియర్ హీరోయిన్ భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. వీరికి ఒక కూతురు అభినయ జన్మించింది. అయితే కొంత కాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2005లో తన భర్త నుంచి విడిపోయి కూతుర్ని తీసుకొని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటుంది భానుప్రియ. ఇకపోతే భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ కూడా 2018లో గుండెపోటుతో మరణించారు.

భానుప్రియ సినిమా జీవితం..

Advertisement

1967 జనవరి 15న రాజమండ్రి జిల్లా రంగంపేటలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమె.. ఎక్కువగా తెలుగు, తమిళ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి పేరు దక్కించుకుంది. ముఖ్యంగా 1980 -1993 మధ్యకాలంలో హీరోయిన్గా చలామణి అయిన ఈమె.. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. భానుప్రియ దాదాపు 110 కి పైగా సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఇకపోతే అభిమానులు ఈమెను మరో శ్రీదేవి అని పిలుచుకుంటున్నారు.

శాంతిప్రియ వ్యక్తిగత జీవితం..

శాంతిప్రియ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్ధార్థ రాయ్ ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగగా.. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2004లో సిద్ధార్థ కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు.ఇక తన అక్క భానుప్రియ భర్త ఎలా అయితే గుండెపోటుతో మరణించారో ఇక్కడ తన భర్త కూడా అలాగే మరణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

ALSO READ:Trivikram – Venkatesh: ఆదర్శ కుటుంబం.. మార్క్ చూపించనున్న త్రివిక్రమ్.. ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీనా?

శాంతిప్రియ సినిమాలు..

ఇక శాంతి ప్రియ సినిమాల విషయానికి వస్తే.. తన అక్క భానుప్రియ లాగే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె అసలు పేరు నిశాంతి..కానీ సినిమాలలోకి వచ్చిన తర్వాత శాంతి ప్రియగా తన పేరును మార్చుకుంది. తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ముఖేష్ కన్నా, అక్షయ్ కుమార్ లాంటి పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. అటు సినిమాలలో ఇటు టీవీ రంగంలో కూడా మంచి పేరు ఘడిచింది శాంతి ప్రియ.

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×