E-Paper
Advertisement

Sankranthi Movie’s: సంక్రాంతి బరి నుండి మరో మూవీ అవుట్.. అసలేం జరుగుతోంది?

Sankranthi Movie’s: సంక్రాంతి బరి నుండి మరో మూవీ అవుట్.. అసలేం జరుగుతోంది?
Advertisement

Sankranthi Movie’s: టాలీవుడ్ బాక్సాఫీస్ కి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి వచ్చే సెలవులను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారో.. ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చి తమ స్టార్ స్టేటస్ ను పెంపొందించుకోవాలని నటీనటులు కూడా అంతే ఆరాటపడుతున్నారు. ఈ సంక్రాంతికి సక్సెస్ అందుకున్నామంటే ఖచ్చితంగా ఆడియన్స్ దృష్టిలో పడతామని కొంతమంది భావిస్తే.. అసలు సక్సెస్ కొట్టకపోయినా ఈ సంక్రాంతి సినిమాలతో గుర్తింపు తెచ్చుకోవచ్చని ఆరాటపడే వారు కూడా లేకపోలేదు. అలా సంక్రాంతి టార్గెట్ గా ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

సంక్రాంతి బరి నుండి తప్పుకున్న మరో మూవీ..

ఇకపోతే ఈసారి బడా హీరోలను మొదలుకొని యంగ్ హీరోలే కాకుండా డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ చిత్రాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు చిత్రాలు ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలు ఈ ఏడాది సంక్రాంతికి పోటీ పడబోతున్నాయి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జననాయకుడు, హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన జననాయకుడు ప్రొడక్షన్ హౌస్..

Advertisement

అయితే ఈ సంక్రాంతి రేస్ నుంచి జనవరి 9న విడుదల కావాల్సిన విజయ్ దళపతి జననాయకుడు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించకపోవడం వల్లే వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇకపోతే విడుదల సమయం దగ్గర పడుతున్నా.. అనుమతులు రాకపోవడంతోనే నిర్మాణ సంస్థ కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇక కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. మొత్తానికి అయితే సంక్రాంతి రేస్ నుండి విజయ్ దళపతి మూవీ తప్పుకుంది.

సంక్రాంతికి డబ్బింగ్ వెర్షన్ చిత్రాలు రానట్టే..

ఈ బాటలోనే మరో కోలీవుడ్ చిత్రం కూడా తప్పుకోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే .. తమిళ హీరో శివ కార్తికేయన్ , శ్రీ లీల జంటగా నటించిన పరాశక్తి తెలుగు వెర్షన్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. జనవరి 10న విడుదల కావలసిన ఈ చిత్రానికి.. తెలుగులో ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు వంటి భారీ చిత్రాలు ఉండడంతో థియేటర్ల కొరత ఏర్పడింది. అటు ప్రమోషన్స్ కూడా ప్రారంభం కాకపోవడం వల్లే తెలుగు వెర్షన్ జనవరి 23కి వాయిదా వేసినట్లు సమాచారం. మొత్తానికైతే ఈ సంక్రాంతికి ఈ 2 డబ్బింగ్ చిత్రాలు వాయిదా పడడం గమనార్హం.

Advertisement

also read:The RajaSaab: టాలీవుడ్ ఉన్నంతకాలం ఆ సీన్ నిలిచిపోతుంది.. అంచనాలు పెంచిన డిస్ట్రిబ్యూటర్

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×