E-Paper
Advertisement

The RajaSaab: టాలీవుడ్ ఉన్నంతకాలం ఆ సీన్ నిలిచిపోతుంది.. అంచనాలు పెంచిన డిస్ట్రిబ్యూటర్

The RajaSaab: టాలీవుడ్ ఉన్నంతకాలం ఆ సీన్ నిలిచిపోతుంది.. అంచనాలు పెంచిన డిస్ట్రిబ్యూటర్
Advertisement

The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చివరిగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో కల్కి 2898AD సినిమాలో నటించి ఏకంగా 1000కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి, చరిత్ర సృష్టించి.. ఇప్పుడు రెండేళ్ల విరామం తర్వాత ది రాజాసాబ్ (The Raja Saab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. విఎఫ్ఎక్స్ పెండింగ్ కారణంగానే విడుదలకు నోచుకోలేదు. ఇక ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ తో మంచి గ్రాస్ ని నమోదు చేసుకున్న ఈ సినిమా.. అటు ఇండియాలో కూడా ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కూడా మంచి గ్రాస్ నమోదు చేసుకుంటూ ఉండడం గమనార్హం.

డిస్ట్రిబ్యూటర్ ఆడియో కాల్ లీక్..

ఇదిలా ఉండగా మరొకవైపు ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సుమారుగా 2 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఇక తెలంగాణలో అడ్వాన్సు బుకింగ్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలు కాబోతున్నాయి. ప్రీమియర్ షో ద్వారానే సుమారుగా 20 కోట్ల వరకు గ్రాస్ వసూలు వచ్చే అవకాశం ఉందని, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వస్తుందని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా గురించి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు సోదరుడైన శిరీష్ ఒక అభిమానితో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ గురించి ఆయన చేసిన కామెంట్లు అభిమానులలో అంచనాలు పెంచేసాయి.

Advertisement

also read:Toxic: యష్ బర్తడే స్పెషల్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న హీరో ఇంట్రడక్షన్ గ్లింప్స్!

ప్రభాస్ నటన మొత్తం ఒక్క సినిమాలోనే..

శిరీష్ మాట్లాడుతూ.. “ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాను నేను నిన్న చూశాను. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాలో ప్రభాస్ నటన చూసి ఇందులో నటించింది నిజంగా ప్రభాసా అని ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు ఆయన నటించిన 24 సినిమాల్లోని నటన మొత్తాన్ని ఇందులోనే చూపించారు. క్లైమాక్స్ లో వచ్చే హాస్పిటల్ సీను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం మాట్లాడుకునే సన్నివేశం అది. ప్రభాస్ నటన వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ లాంటి హీరో మరొకరు లేరేమో అనే అభిప్రాయానికి మీరంతా వస్తారు” అన్నట్టుగా శిరీష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికైతే శిరీష్ చెబుతున్న మాటలు విన్న ప్రతి అభిమాని కూడా ప్రీమియర్ షో కోసం తెగ ఎదురుచూస్తున్నారు. మరి ప్రీమియర్స్ తోనే కోట్లు రాబడుతుందని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రూ.400 కోట్లు ఈ సినిమా రాబడితే ఇక టాలీవుడ్ సేఫ్ జోన్ లోకి వెళ్లడానికి మొదటి అడుగు వేసినట్లే అని చెప్పవచ్చు..

Advertisement

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×