E-Paper
Advertisement

Sankranti Movies: సంక్రాంతి హీరోల సంబరాలు అంతేనా.. నిరాశలో ఫ్యాన్స్..

Sankranti Movies: సంక్రాంతి హీరోల సంబరాలు అంతేనా.. నిరాశలో ఫ్యాన్స్..
Advertisement

Sankranti Releases 2026: తెలుగు సినీ ప్రేమికులకు సంక్రాంతి అంటే నిజంగానే పెద్ద పండగ. పెద్ద హీరోల సినిమాలు ఒకటి తర్వాత ఒకటి లైన్‌లో విడుదల అయ్యే సమయం అది. థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయనే అంచనాలు, టికెట్ రేట్లపై చర్చలు, ఫ్యాన్స్ హంగామా ఇలా ఇండస్ట్రీ మొత్తం కళకళలాడుతుంది. కానీ ఈసారి ఒక విషయం మాత్రం అందరినీ నిరాశకు గురి చేస్తోంది. సంక్రాంతి సినిమాలు చేస్తున్న పెద్ద హీరోలు మీడియా ముందు పెద్దగా కనిపించడం లేదు.

సాధారణంగా సినిమా రిలీజ్ అవుతుందంటే హీరో మీడియా మీట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. ఒక్క హీరో కూడా సరిగ్గా మీడియా తో ఇంటరాక్ట్ అవ్వడం లేదు. దీనికి కారణం ఏంటి అని ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. దీనికి చాలామంది హీరోలు చెప్పుకునే కారణం ఒక్కటే. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలు

Advertisement

అందుకే అలా అసౌకర్యంగా ప్రశ్నలకి జవాబులు ఇచ్చే బదులు హీరోలు మీడియా కి దూరంగా ఉండేలా చూస్తున్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అదే హీరోలు బాలీవుడ్ మీడియాతో కానీ, ఇతర భాషల మీడియాతో కానీ చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేస్తారు. కానీ తెలుగు మీడియా దగ్గరకు వచ్చేసరికి మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఇది తెలుగు ప్రేక్షకులకు మాత్రం నిరాశ కలిగించే విషయం.

ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ ఒకటి. ఇంత పెద్ద సినిమా అయినా కూడా ప్రభాస్ ఇప్పటివరకు మీడియా ముందు రావడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రమే వచ్చి, ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతే. అభిమానులు మాత్రం “ఇంకా ఎందుకు ప్రమోషన్స్ లేవు?” అని ఆశ్చర్యపోతున్నారు. ఇదే పరిస్థితిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా “మన శంకర వర ప్రసాద్ గారు” కి కూడా ఉంది. చిరంజీవి కూడా మీడియా మీట్స్‌కి రాకుండా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ కూడా సినిమాలో ఉన్నప్పటికీ ఆయన కూడా మీడియాతో మాట్లాడలేదు.

Advertisement

రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విషయానికి వస్తే, రవితేజ సాధారణంగానే మీడియాకు కొంచెం దూరంగా ఉంటారు. ఈ సినిమా విషయంలో కూడా అదే కొనసాగుతోంది. ప్రమోషన్స్ అన్నీ టీమ్ మీదే వదిలేశారు.
ఇక హీరో శర్వానంద్ పరిస్థితి మరింత డిఫరెంట్. వరుస ఫ్లాప్స్ తర్వాత నారి నారి నడుమ మురారి సినిమాతో వస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన నుంచి కూడా మీడియా ముందు వచ్చే అవకాశాలు కనిపించలేదు. ప్రమోషన్స్ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

కొంతవరకు ఈ పరిస్థితిలో డిఫరెంట్‌గా కనిపిస్తున్న హీరో నవీన్ పోలిశెట్టి. తన సినిమా ‘అనగనగా ఒక రాజు’ కోసం మీడియా ఈవెంట్ లకు బాగానే అటెండ్ అయ్యారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూలు కూడా స్టార్ట్ అవుతాయని సమాచారం. మొత్తానికి ఈ సంక్రాంతి సినిమాలు భారీగా ఉన్నా, హీరోల ప్రమోషన్స్ లేకపోవడం మాత్రం ప్రేక్షకుల్లో నిరాశ కలిగిస్తోంది.

ALSO READ: The RajaSaab: టాలీవుడ్ ఉన్నంతకాలం ఆ సీన్ నిలిచిపోతుంది.. అంచనాలు పెంచిన డిస్ట్రిబ్యూటర్

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×