Thalaivar 173: కోలీవుడ్ స్టార్ హీరోలైన రజనీకాంత్ (Rajinikanth)కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ హీరోలుగా తెరపై కనిపించడం కాదు కానీ కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ సినిమా చేయబోతున్నట్లు గత 15 రోజుల క్రితం అధికారికంగా వెల్లడించారు. ఈ విధంగా రజనీకాంత్ కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా చేయబోతున్నారనే వార్త అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్(Sundar.C) దర్శకత్వం వహించబోతున్నారని తెలిపారు.
ఇక ఈ సినిమాకు అన్ని సిద్ధమయ్యాయి షూటింగ్ మొదలు కావడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఈ సినిమా నుంచి దర్శకుడు సుందర్ తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో రోజుకొక వార్త చక్కర్లు కొడుతోంది. ఇక రజనీకాంత్ ను ధనుష్ డైరెక్టర్ చేయబోతున్నారంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి కానీ ఇందులో నిజం లేదని తెలిపారు. అయితే రజనీకాంత్ సంతృప్తి చెందే కథ వచ్చినప్పుడే తాము సినిమాలు చేస్తామని కమల్ హాసన్ కూడా తెలియచేశారు. ప్రస్తుతం నిర్మాతలు సరైన కథ దర్శకుడి కోసం వేట మొదలుపెట్టారనే తెలుస్తుంది. అయితే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో రాబోతున్న తలైవార్ 173(Tahalaivar 173) సినిమాకు దర్శకుడు దాదాపు కన్ఫామ్ అయ్యారని తెలుస్తోంది ఈ సినిమా కోసం పార్కింగ్ సినిమా(Parking Movie) దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ (Ram Kumar Balakrishnan) ఫిక్స్ అయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈయన చెప్పిన స్టోరీ లైన్ విన్న రజినీకాంత్ ఇంప్రెస్ అయ్యారని పూర్తి కథ డెవలప్ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. మరి రజనీకాంత్ సినిమా కోసం రామ్ కుమార్ ఎంపిక అయ్యారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే నిర్మాతలు స్పందించాల్సి ఉంది.
జైలర్ 2 పనులలో రజనీకాంత్..
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించబోతున్నారంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాలన్నింటికీ చిత్ర బృందం త్వరలోనే అధికారకంగా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2(Jailer 2) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలైన అనంతరం రజనీకాంత్ కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న సినిమా సెట్స్ పైకి వస్తుందని అందరూ భావించారు కానీ ఇలా అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
Also Read: Mahesh Babu -Nagachaitanya: NC 24 ఫస్ట్ లుక్ లాంచ్ ..రంగంలోకి మహేష్ బాబు..