E-Paper
Advertisement

The Raja Saab Release Date : డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా.. థియేటర్లలోకి సాబ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

The Raja Saab Release Date : డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా.. థియేటర్లలోకి సాబ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..
Advertisement

The Raja sab Release date : పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాజా సాబ్.. గత ఏడాది కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటుగా.. యావత్ మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది.. ఇప్పటికీ మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వినిపించేది. ఆ రూమర్స్ కి తాజాగా మారుతి టీం చెక్ పెట్టేసింది.. మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

రాజా సాబ్ రిలీజ్ డేట్ లాక్..

ప్రభాస్ ఎప్పుడు తన చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉంటాడు.. అయితే ఏడాదికి ఒక్క సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. డార్లింగ్ అభిమానులు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈ ఏడాది ‘రాజాసాబ్’ మూవీతో థియేటర్లోకి రాబోతున్నాడు.. ఈ మూవీ ఈ ఏడాది మార్చి నుంచి వాయిదా పడుతూనే వస్తుంది. చివరకు డిసెంబర్ లోనైనా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వచ్చేయేడాది జనవరి నెలలో సంక్రాంతి రేసులో బరిలోకి దిగింది. ఈ డేట్ పై కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా వాటికి చెక్ పెడుతూ చిత్రయూనిట్  రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 8న థియేటర్లలోకి రాబోతుంది.. ఆ రోజున నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు పడబోతున్నట్లు పోస్టర్ తో ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ డార్లింగ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.

Advertisement

Also Read :  బిగ్ బాస్ మొత్తం స్క్రిప్ట్… మరోసారి సాక్ష్యాలతో బయటపెట్టిన దమ్ము శ్రీజ..

రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది…

ప్రముఖ నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌ను పూర్తిగా భిన్నమైన అవతారంలో స్పెషల్ ఎంటర్‌టైనర్‌గా చూపించబోతున్నట్లు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ను చూస్తే తెలుస్తుంది. తాజాగా 23 న రాజా సాబ్ నుంచి మరో సింగిల్ ను రిలీజ్ చెయ్యనున్నారని ప్రకటించారు. ప్రభాస్‌లోని రొమాంటిక్ సైడ్‌ను చూపించే అద్భుతమైన మెలోడీ సాంగ్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు డార్లింగ్ తో రొమాన్స్ చేయబోతున్నారు. ఇక ఇండియాలో ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. మరి సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×