E-Paper
Advertisement

Mahesh Babu -Nagachaitanya: NC 24 ఫస్ట్ లుక్ లాంచ్ ..రంగంలోకి మహేష్ బాబు..

Mahesh Babu -Nagachaitanya: NC 24 ఫస్ట్ లుక్ లాంచ్ ..రంగంలోకి మహేష్ బాబు..
Advertisement

Mahesh Babu -Nagachaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య(Nagachaitanya) ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu)దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల మేకర్స్ ఈ సినిమా సెట్ నుంచి ఒక మేకింగ్ వీడియోని విడుదల చేయడంతో ఇది కాస్త సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసింది.

టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ..

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ప్రస్తుతం NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది త్వరలోనే ఈ సినిమా టైటిల్ రివిల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ తో పాటు నాగచైతన్య ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) చేతుల మీదుగా ఈ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ ద్వారా తెలియచేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇలా నాగచైతన్య సినిమా కోసం ఏకంగా గ్లోబల్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగడంతో ఈ సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడింది.

నాగచైతన్య కోసం మహేష్ బాబు..

Advertisement

ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే మహేష్ బాబు చేతుల మీదుగా నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ఈమె సైంటిస్ట్ గా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.

Advertisement

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్ తో పాటు బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది . ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. వెంట వెంటనే ఈ రెండు సినిమాల షూటింగ్ పనులను డైరెక్టర్ కార్తీక్ పూర్తి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే విషయం గురించి చిత్ర బృందం ఇప్పటివరకు అధికారకంగా స్పందించలేదు కానీ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Also Read: Mrunal Thakur: అమ్మకు అవమానం… కట్ చేస్తే ఖరీదైన కారు కొన్న మృణాళ్ ఠాకూర్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×