E-Paper
Advertisement

Aus vs Eng : 132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..35 ఏళ్ళ వయసులో స్టార్క్ అదిరిపోయే క్యాచ్.. గూస్ బంప్స్ రావాల్సిందే

Aus vs Eng : 132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..35 ఏళ్ళ వయసులో స్టార్క్ అదిరిపోయే క్యాచ్.. గూస్ బంప్స్ రావాల్సిందే
Advertisement

Aus vs Eng : యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా బౌల‌ర్ మిచెల్ స్టార్క్ చెల‌రేగి ఆడుతున్నారు. ఇటు బౌలింగ్ లో, ఇటు ఫీల్డింగ్ లోనూ అదుర‌గొడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాట‌ర్ జాక్ క్రాలీ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. క్రాలీ ఇచ్చిన క్యాచ్ ను స్టార్క్ అద్భుతంగా ప‌ట్టాడు. మొద‌టి ఇన్నింగ్స్ లోనూ స్టార్క్ ఇంగ్లండ్ ను చావుదెబ్బ కొట్టిన విష‌యం తెలిసిందే. ఏకంగా కెరీర్ అత్యుత్త‌మ గ‌ణాంకాల (7/58) దుమ్ము రేపారు. 132 ప‌రుగుల‌కే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు కేవ‌లం 132 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ 5 వికెట్ల‌తో స‌త్తా చాటారు. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 2 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ క్రాలే వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం స్టోక్స్ సేన 42 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 172 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.

Also Read : IND VS SA 2nd Test: టాస్ మరోసారి ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఇద్దరు కొత్త ప్లేయర్లు ఎంట్రీ, లంచ్ బ్రేక్ లో మార్పులు

స్టార్క్ అదిరిపోయే క్యాచ్

Advertisement

ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టు రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ స్టార్క్ వికెట్ తీశాడు. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఇంగ్లండ్ జ‌ట్టు 99 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ప‌రిశీలించిన‌ట్ట‌యితే ఇంగ్లాండ్ బ్యాటింగ్.. క్రాలే 0, డ‌కెట్ 21, ఓలి పోప్ 46, రూట్ డ‌కౌట్, హ్యారీ బ్రూక్ 52, స్టోక్స్ 6, జెమీ స్మిత్ 33, అట్కిన్ స‌న్ 1, కార్సె 6, జోఫ్రా ఆర్చ‌ర్ 0, మార్క్ ఉడ్ 0 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 32.5 ఓవర్లలో 172 ప‌రుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టు 45.2 ఓవర్ల‌లో 132 ప‌రుగులు చేసింది. వీత్ రాల్డ్ 0, లాబుశాగ్నె 9, స్టీవెన్ స్మిత్ 17, క‌వాజా 2, హెడ్ 21, గ్రీన్ 24, అలెక్స్ కారె 26, మిచెల్ స్టార్క్ 12, లియాన్ 4, బొనాల్డ్ 0, బ్రెండ‌న్ డొగెట్ 7 ప‌రుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు 132 ప‌రుగుల‌కే కుప్ప కూలింది.

బంతితో విజృంభించిన బెన్ స్టోక్స్..!

క్రికెట్ అభిమానులు అంద‌రూ ఎప్పుడు ఎప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన యాషెస్ సిరీస్ అనూహ్య రీతిలో ప్రారంభ‌మైంది. పెర్త్ స్టేడియంలో ఆసీస్ పేస‌ర్లు అద‌ర‌గొట్ట‌డంతో ప్ర‌త్య‌ర్థిని త‌క్కువ స్కోర్ కే ప‌రిమితం చేశాం అనుకుంటే.. ఇంగ్లాండ్ బౌల‌ర్లు కూడా తామేం త‌క్కువ కాద‌ని నిరూపించారు. మిచెల్ స్టార్క్ ధాటికి ఇంగ్లండ్ స్వ‌ల్ప స్కోరుకే కుప్ప‌కూలింది. బ్యాటింగ్ లో ఆక‌ట్టుకోలేక‌పోయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బంతితో విజృంభించాడు.5 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. ముఖ్యంగా పేస‌ర్ల‌కు అనుకూలించే పెర్త్ పిచ్ పై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా యాషెస్ సిరీస్ తొలి తొలిరోజే 19 వికెట్లు కుప్ప‌కూల‌డం విశేషం. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో స్టార్క్ 58 ప‌రుగులు ఇచ్చి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌ళ్లీ రెండో ఇన్నింగ్స్ లో సైతం మ‌రో వికెట్ ప‌డ‌గొట్టి అదుర్స్ అనిపించాడు. ప్ర‌స్తుతం అత‌ని వికెట్ సంబంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం విశేషం.

Advertisement

Also Read : Super Over : సున్నాకే 2 వికెట్లు.. వైభ‌వ్ ను సూప‌ర్ ఓవ‌ర్ లో దించ‌క‌పోవ‌డం పై ట్రోలింగ్.. జితేష్ శ‌ర్మ చెత్త కెప్టెన్సీ అంటూ

 

Related News

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

Big Stories

Advertisement
×