Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమా నిర్మాతలు ప్రకటించిన ప్రకారం మార్చి 19న విడుదలయ్యేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, యుబైఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సినిమాల తర్వాత సరైన సినిమా లేక ప్రేక్షకులు కూడా, ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా అనుకున్న టైమ్‌కి వస్తుందా? రాదా? అని అనుమానంలో ఉన్న వారు కూడా, సెన్సార్ పూర్తి అనే మాట విన్న తర్వాత, ఆ డౌట్స్ వదిలి, సెలబ్రేషన్ మోడ్‌లోకి వచ్చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా మార్చి 19 లేదంటే మార్చి 18న ప్రీమియర్స్‌తోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మరో వైపు ప్రమోషన్స్ కూడా పీక్స్ అనేలా మేకర్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం నుంచి మూడో పాట ‘కాలరే ఎత్తరా’ లిరికల్ సాంగ్ (Collar Ey Etthara Lyric Video)ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఎలా ఉందంటే..
Also Read- Rashmika Mandanna: ఎనిమిదేళ్లుగా వేధింపులు.. 24 గంటల్లో డిలీట్ చేయండి అంటూ రష్మిక వార్నింగ్
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు వచ్చిన ఈ ‘కాలరే ఎత్తరా’ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అనేలా ఉంది. ఇందులో పవర్ స్టార్ మెస్మరైజింగ్ స్టెప్స్ నిజంగానే పాటలో ఉన్న కిక్కును ఇస్తున్నాయంటే నమ్మాలి. ‘ఎక్కే దిగే కిక్కులోన దక్కేదేవుందే.. అరె సచ్చే దాకా కిక్కే ఉండాలే’ అంటూ ఫ్యాన్స్‌కు కిక్కేక్కించేలా ఉన్న ఈ పాటకు దేవిశ్రీ అందించిన స్వరాలు, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం, రామ్ మిరియాల గాత్రం.. ఇవన్నీ వేటికవే సాటి అనేలా ఉన్నాయి. ఇక ఈ పాటలో పవన్ కళ్యాణ్ కనబడిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటారో.. హరీష్ శంకర్‌కు తెలిసినట్లుగా మరో దర్శకుడికి తెలియదనే చెప్పాలి. ఎందుకంటే, ఆయన కూడా పవన్ కళ్యాణ్‌కు డై హార్డ్ ఫ్యాన్ అనే విషయం తెలియంది కాదు.
Also Read- Actor Tarun: ఇద్దరి ప్రాణాలు కాపాడిన హీరో తరుణ్..ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..!
మాములుగా పవన్ కళ్యాణ్ సరిగ్గా డ్యాన్స్ చేసి చాలా కాలం అవుతుంది. కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించి వచ్చిన పాటలన్నింటిలో పవర్ స్టార్ డ్యాన్స్ ఇరగ్గొట్టేశారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడొచ్చిన ‘కాలరే ఎత్తరా’ సాంగ్‌లో అయితే స్టెప్స్ అదిరాయి. ఆయన ఈ స్టెప్స్, మేకోవర్ చూసి ‘గబ్బర్ సింగ్’ వైబ్ కనబడుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌తో చెలరేగిపోతున్నారు. ఈ పాటకు సాహిత్యం కూడా అద్భుతంగా కుదిరింది. మొత్తంగా అయితే సినిమాపై బ్లాక్ బస్టర్ వైప్‌ని ఈ పాట క్రియేట్ చేస్తుందంటే.. అతిశయోక్తి కానే కాదు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను నిర్వహించారు.
Also Read- Boyapati: అఖండ 2 తర్వాత మరో భారీ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టిన బోయపాటి..!