Pawan Kalyan Fans : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోలలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఒకరు. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అభిమానుల కారణంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్లు నెటిజన్స్ తమ అభిప్రాయాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక ప్రముఖ కన్నడ ఛానల్.. కన్నడ హీరో దర్శన్ రియల్ హీరో అని చూపించడమే కాకుండా మన తెలుగు హీరోలను అవమానపరిచేలా చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసినా.. ఇందుకు సంబంధించిన మరో పోస్టు.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా చేస్తోంది.
అవమానించినా .. క్షమాపణ కోరుతున్న పవన్ ఫ్యాన్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. సదరు కన్నడ న్యూస్ ఛానల్ వాళ్లు.. సింహం లాగా హీరో దర్శన్ ని చూపెడుతూ.. ఆ సింహం కింద కుక్కల రూపంలో మన తెలుగు హీరోలని చూపిస్తూ చేసిన ఒక పోస్ట్ అత్యంత దారుణంగా అవమానించినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ విషయం తెలుగు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సదరు న్యూస్ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన పని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది.
దర్శన్ అభిమానులు పవన్ అభిమానులకు డబ్బులు ఇచ్చారా?
ఈ మేరకు ఒక పోస్ట్ వైరల్ అవ్వగా.. ఆ పోస్టులో దర్శన్ ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలతో.. దర్శన్ ను క్షమించండి అని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరినట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు దర్శన్ అభిమానుల నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్యాకేజీ తీసుకున్నారు. అందుకే తెలుగు హీరోలను అంత అవమానించినా సరే ఇంకా దర్శన్ ను క్షమించమని కోరడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన పనికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైనా స్పందిస్తారో చూడాలి.
సదరు న్యూస్ ఛానల్ పై టీఎఫ్ఐ మండిపాటు..
ఇకపోతే సదరు న్యూస్ ఛానల్ పై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభిమానిని హత్య చేసినాడు మీ దృష్టిలో హీరోనా? అలాంటి వాడికా మీరు పట్టం కట్టేద అంటూ మండిపడుతున్నారు. అంతే కాదు తెలుగు హీరోలను హీనంగా చూపించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంతలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన పని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభిమానులను మోసం చేశారు అనేలా తెలుస్తోంది. మరి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైనా స్పందిస్తారా ? ఒకవేళ ఇది పవన్ కళ్యాణ్ వరకు చేరితే అసలు ఏం జరగబోతోంది? అనే విషయాలు వైరల్ గా మారుతాయి.
ALSO READ :Rashmika Mandanna: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రష్మిక.. సడన్ గా ఏమైందంటూ?
— Out of Commentary (@OutofContestTel) July 6, 2025