Rashmika Mandanna: ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna) నేషనల్ క్రష్ గా ఎదిగిపోయింది. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రష్మిక.. ఈమధ్య వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తూ.. ఆ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది రష్మిక. అందులో హాలీవుడ్ యాక్టర్ ను తలపించేలా రష్మిక లుక్ ఉండడంతో.. సడన్ గా ఇలా మారిపోయింది ఏంటి? కొంపతీసి హాలీవుడ్ సినిమాలో నటిస్తోందా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రష్మిక..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఇలా హాలీవుడ్ యాక్టర్ లా రష్మిక కనిపించడం వెనుక కారణం ఆమె ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజ్ అని తెలుస్తోంది. Dairy Cut -2025 మ్యాగజైన్ తన కవర్ పేజీ కోసం ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు.. సదరు సంస్థ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసింది. Dairy Cut -2025 రష్మిక మందన్న ఫోటోని షేర్ చేస్తూ.. “ప్రతిభతో కూడిన మా కొత్త మేనిఫెస్టో ద్వారా రష్మిక అరంగేట్రం చేయడం మాకు మరింత గర్వంగా ఉంది. పుష్ప 2, ఛావా, యానిమల్ సినిమాలతో కలెక్షన్లు లేక ఎడారిలా మారిన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. అటు చిత్ర నిర్మాతలకే కాదు ఇటు ఫైనాన్షియార్ లకి కూడా ఇష్టమైన నటిగా రష్మిక మారిపోయింది. రష్మిక ప్రముఖ మహిళల బ్రాండ్ మాత్రమే కాదు ఈమె కొత్త సృజనాత్మక , ఆర్థిక వ్యవస్థకు బ్లూ ప్రింట్ లాంటిది అంటూ క్యాప్షన్ జోడించింది. ఇటు రష్మిక కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఇదే విషయాన్ని పంచుకుంటూ తన కొత్త గెటప్ ను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్మిక మందన్న సినిమాలు..
కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగులో నాగ శౌర్య సరసన ఛావా సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన రష్మిక మందన్న.. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. ఇక మూడు సంవత్సరాల కాలంలోనే మూడు చిత్రాలతో మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన కుబేర సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఇకపోతే సక్సెస్ పరం పరా కొనసాగిస్తూ ఎంతోమంది సీనియర్ స్టార్ హీరో, హీరోయిన్లకు రోల్ మోడల్ గా నిలుస్తున్న ఈమె ఇప్పుడు ఇలా మ్యాగజైన్ల కోసం కూడా ఫోటోలకు ఫోజులిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం రష్మిక ఫోటో చూసి హాలీవుడ్లో అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్ .
ALSO READ: Bhairavam OTT: మంచు మనోజ్ భైరవం ఓటీటీ డేట్ వచ్చేసింది… అఫిసియల్ అనౌన్స్‌మెంట్