Bangalore News: కర్నాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని వేధిస్తున్నాడని.. యువకుడిపై కొంతమంది క్రూరంగా దాడి చేశారు. అడవిలోకి తీసుకెళ్లి యువకుడి బట్టలు విప్పి ప్రైవేట్ భాగాలపై ఇష్టమొచ్చినట్టు దాడి చేశారు. కర్రలు అలాగే రాడ్లతో.. గ్యాంగ్ దాడి చేశారు. బాధిత యువకుడి ఎంత బతిమిలాడినా వినకుండా కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నాటక రాష్ట్రం, బెంగళూరులోని సోలదేవనహళ్లికి చెందిన కుశాల్, మరో యువతి మధ్య గత కొన్ని రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య గొడవలు అయ్యి బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ యువతి కుశాల్ కు బ్రేకప్ చెప్పి మరో యువకుడి లవ్ వ్యవహారం నడిపుతోంది. అనంతరం కుశాల్ రోజు ఆ యువతికి అసభ్యకరంగా మెసేజులు పెట్టడం స్టార్ట్ చేశాడు. కుశాల్ మెసేజ్ చేయడం ఆ యువతికి అస్సలు నచ్చలేదు. దీంతో యువతి కుశాల్ మెసేజీలు పంపిస్తున్నాడని ప్రస్తుతం లవ్ చేస్తున్న యువకుడికి చెప్పింది.
దీంతో యువకుడు మాట్లాడుకుందామని పిలిచి ఫ్రెండ్స్ తో దాడి చేయించాడు. యువతి ప్రియుడు, కొంత గ్యాంగ్ తో కలిసి కుశాల్ ను ఫారెస్ట్ లోకి తీసుకెళ్లారు. బట్టలు విప్పి.. కర్రలతో చితకబాదారు. అంతటతో ఊరుకోకుండా ప్రైవేట్ పార్ట్స్ పై రాడ్లు, కర్రలతో కొట్టారు. కుశాల్ కొట్టవద్దని ఎంత బతిమిలాడినా వారు విడిచిపెట్టలేదు. దారుణంగా కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిపై దాడి చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ALSO READ: Fish Venkat -Vishwak: ఫిష్ వెంకట్ కు అండగా హీరో విశ్వక్.. టాలీవుడ్ ఇప్పుడు మేల్కొంటుందా?
ఈ సంఘటన కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్ర గౌడ విషయంలో రేణుక స్వామి హత్యను తలపించేలా ఉందన సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. యువకుడిని చితకబాదిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యువకుడిపై దాడి చేసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.