Upcoming Electric SUV Launches in India: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2026లో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు విడుదల కాగా, మరికొన్ని క్రేజీకార్లు విడుదలకు రెడీగా ఉన్నాయి. మారుతి సుజుకి, టయోటాతో పాటు టాటా మోటార్స్ నుంచి అద్భుతమైన కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ ఏడాది అందుబాటులోకి రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి సుజుకి 2026 ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ కు రెడీ అవుతోంది. మరికొద్ది నెలల్లోనే అందుబాటులోకి రానుంది. ఈ కంపెనీకి చెందిన తొలి ఎలక్ట్రిక్ కారు గత సంవత్సరం డిసెంబర్‌లో అధికారికంగా ఆవిష్కరించబడింది. ఈ EV డెల్టా, జీటా, ఆల్ఫా ట్రిమ్ స్థాయిలలో అందుబాటులోకి రానుంది. ఇది 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ లలో రానుంది. ఈ కారు రేంజ్ సింగిల్ ఛార్జ్ పై 543 కిలోమీటర్ల వరకు ఉంటుంది. హార్టెక్ట్ ఇ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న ఇండియా స్పెక్ మోడల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ను మాత్రమే పొందుతుంది. పవర్ అవుట్ పుట్ 172 bhp, 193 Nm పీక్ టార్క్ ను కలిగి ఉంటుంది.
టాటా మోటార్స్ 2026 కూడా ఫస్ట్ క్వార్టర్ లో విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్ SUV లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది. ICE సియెర్రాతో పోల్చితే ఇది అద్భుతమైన ఫ్రంట్ ఫాసియాతో విభిన్నంగా ఉంది. ఇందులో ఖాళీగా ఉన్న గ్రిల్ ఉంటుంది. ARGOS ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, సియెర్రా EV ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఎంపికను పొందుతుంది. ఎలక్ట్రిక్ సియెర్రా పవర్ ట్రెయిన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే, కర్వ్ EV నుంచి 55 kWh బ్యాటరీ ప్యాక్, హారియర్ EV నుంచి 65 kWh యూనిట్‌ను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ SUV ఒకే ఛార్జ్ పై 500 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ 2022లో ప్రారంభించిన టియాగో EV మిడ్ లైఫ్ ఫేస్‌లిఫ్ట్ పై పని చేస్తోంది. ఇది ఈవీగా 2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి రానుంది. అప్ డేటెడ్ బంపర్లు, ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్లతో సహా డిజైన్ లో చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉంది. క్యాబిన్ లోపల, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్ డేట్ చేసిన అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది. హుడ్ కింద, టియాగో EV ఫేస్ లిఫ్ట్ 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఎంపికలతో రానుంది. ఇవి వరుసగా 223 కిలోమీటర్లు, 293 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవిన్యా 2026 చివరి నాటికి భారత మార్కెట్లో అడుగు పెట్టనుంది. ఇది సొగసైన స్పోర్ట్ బ్యాక్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. అధునాతన గ్రౌండ్ అప్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ప్లాట్ ఫామ్ రూపొందించబడింది. అవిన్య స్పోర్ట్ బ్యాక్ ప్రీమియం EV విభాగంలో అందుబాటులోకి రానుంది. హ్యుందాయ్ IONIQ 5, కియా EV6కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకే ఛార్జ్ పై 600 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.
రీసెంట్ గా భారత మార్కెట్లోకి అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా విడుదల అయ్యింది. ఇది మూడు వేరియంట్లలో అందించబడుతుంది. E1, E2, E3 వేరియంట్స్ గా అమ్మకాలు జరపుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUVలో 48.8 kWh, 61.1 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి ఒకే ఛార్జ్ పై 543 కిలో మీటర్ల వరకు ప్రయాణించనున్నాయి.
Read Also: చూస్తుండగానే కాలి బూడిదైన మహీంద్రా ఈవీ, కంపెనీ ఏం చెప్పిందంటే?