Pawan Kalyan Makes History with OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉండే స్వాగే వేరు. మ్యానరిజంలో అయిన, స్టైల్లో అయినా పవన్ శైలి ప్రత్యేకం. తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ చిత్రాలతో ట్రెండ్ సెట్ చేశారు. ఆయన ఏం చేసిన అది ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఇక ఆయనకు ఉండే ఫాలోయింగే వేరు. ప్రేమ కథా చిత్రాలతో ఒకప్పుడు యూత్ని ఉర్రుతలుగించారు. 90’s లో పవన్కి ఉండే ఫాలోయింగే వేరు. ట్రెండ్ సెట్ చేయాలన్నా, ట్రెండ్ మార్చాలన్న పవనే అన్నట్టు ఉండేది. ఇప్పటికే ఆ క్రేజ్, ఫాలోయింగ్ అలాగే ఉంది. ఇక పవన్ కెరీర్లో ఎన్నో హిట్, సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.
టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అంత ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న పవర్ స్టార్ కెరీర్ ఇప్పటికీ చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడం గమనార్హం. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో పవన్ స్టార్ అని ట్యాగ్ ఉంది ఒక్క పవన్కే. ఒక్క తెలుగులోనే కాదు ఇతర ఇండస్ట్రలో పవన్కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. దర్శక–నిర్మాతలు సైతం పవన్ శైలిని కొనియాడుతున్నారు. ఏ ఇండస్ట్రీలో అయినా పవన్కి సరిసాటి అనే నటులే లేరు. అంతటి ఘనత ఉన్న ఆయన పేరుపై ఇప్పటి వరకు చెప్పుకునే రికార్డే లేదు. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక.. తెలుగు హీరోలంత వరుసగా రూ. 100 కోట్లు వసూళ్లు చేస్తున్నారు.
ఇక మెగా హీరోలందరిపై ఈ రికార్డు ఉంది. మొన్నటి మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్ కూడా ఈ రికార్డుని సాధించాడు.హేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, నాని వంటి హీరోల చిత్రాలు వరుసగా వందకోట్ల క్లబ్లో చేరుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవనే. అది ఓజీతో తీరింది. పవన్ కెరీర్లో ఇప్పటి వరకు 100 రూపాయల సినిమా లేకపోవడం ఫ్యాన్స్ ఎంతో బాధించింది. కానీ, ఓజీ చిత్రంతో ఫ్యాన్స్ కలని నిజం చేశాడు సుజీత్. ఇక ఓవర్సిస్లో మిలియన్ డాలర్ల సినిమా కూడా లేదు. ఓవర్సిస్లో తెలుగు సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంది.
Also Read: Kantara Movie: తెలుగు ఆడియన్స్ అంటే అంత చులకనా.. మళ్లీ బయటపడ్డ డిస్ట్రిబ్యూటర్స్ నిలువుదోపిడి..
ప్రభాస్,మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి సినిమాలు ఓవర్సిస్లో ఈజీగా మిలియన్ల డాలర్లు చేస్తాయి. అయితే ఇప్పటి వరకు ఈ మైల్ స్టోన్ లేని హీరో కూడా పవనే. అది కూడా ఓజీతోనే సాధ్యమైంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం 5 మిలియన్ల డాలర్లు చేయడం విశేషం. ఇక మిగతా ఎరియాల్లో కలిపి ఓజీ 6 మిలియన్ల వరకు ఉండోచ్చనే అంచనాలు వస్తున్నాయి. తొలి రోజే ఈ చిత్రం ప్రీమియర్లతో కలిపి 2 మిలియన్ డాలర్లు చేసింది. తాజాగా ఈ చిత్రం 5 మిలియన్ల డాలర్లు చేయడంతో పవన్ కెరీర్లో తొలి రికార్డు రికార్డు అయ్యింది. ఇప్పటి వరకు పవన్ సినిమాలో ఓవర్సిస్ వన్ మిలియన్ వరకే మాత్రమే చేశాయి. అవి కూడా ఎంతో కష్టం మీద. కానీ, ఓజీ సినిమా ఏకం 5 మిలియన్లు చేయడం పవర్ స్టార్ కెరీర్లో మైలురాయి ఇది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు.