Srinidhi shetty: శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీనిధి శెట్టికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశం వచ్చింది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేష్ తివారి (Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రామాయణ(Ramayana) సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ కి జోడిగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)సీత పాత్రలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఈమె ఈ సినిమాని రిజెక్ట్ చేశారని, ఈమె ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతోనే సాయి పల్లవి ఎంపిక అయింది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై శ్రీనిధి స్పందించారు. ఈ సందర్భంగా శ్రీనిధి మాట్లాడుతూ… రామాయణ సినిమాలో నాకు సీతగా నటించే అవకాశం వచ్చిన ఆ సినిమా అవకాశాన్ని వదులుకున్నాను అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తాను కూడా అందరిలాగే ఈ సినిమా ఆడిషన్ కి వెళ్లాను. ఆడిషన్స్ కూడా పూర్తి చేశానని అయితే చిత్ర బృందం నుంచి నాకు ఎలాంటి కాల్ రాలేదని క్లారిటీ ఇచ్చారు.
ఇలా తాను అవకాశం వచ్చినా, వదులుకున్నాను అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అసలు విషయాన్ని బయట పెట్టారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామాయణ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా రాబోతుందని, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కాబోతుందని ఇటీవల తెలియజేశారు.
స్పెషల్ సాంగ్ లో తలుక్కుమన్న శ్రీనిధి..
ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటించగా కేజిఎఫ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక శ్రీనిధి విషయానికి వస్తే కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్వరలోనే సిద్దు జొన్నలు గడ్డ హీరోగా నటించిన “తెలుసు కదా” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా శ్రీనిధి శెట్టి తెలుగుతో పాటు కన్నడ భాషలలో కూడా వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇలా సినిమాలలో హీరోయిన్గా మాత్రమే కాకుండా ఇతర సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాలో శ్రీనిధి స్పెషల్ సాంగ్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి ఈ పాట తొలగించినప్పటికీ తిరిగి చిత్ర బృందం ఈ పాటను జోడిస్తూ సినిమాని ప్రసారం చేస్తున్నారు.
Also Read: Little Hearts 2: తెరపైకి లిటిల్ హార్ట్స్ సీక్వెల్… నెటిజన్స్ షాకింగ్ రియాక్షన్