అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందులో భాగంగా చికాగోలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తాజాగా చికాగో డౌన్ టౌన్ లో ఫుడ్ డెలివరీ బాయ్ ని 10 మంది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ICE) ఏజెంట్లను వెంబడించారు. అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, అతడు తన సైకిల్ మీద వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ వీడియోను గ్రేస్టాక్ మీడియా సహ వ్యవస్థాపకుడు, CEO క్రిస్టోఫర్ స్వెట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చికాగోలో జరుగుతున్న అక్రమ వలసదారుల వెనక్కి పంపివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా సదరు యువకుడు స్లోగన్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఆదివారం డౌన్‌టౌన్ చికాగోలో ICE ఆపరేషన్ జరుగుతోందని ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు స్వెట్ వెల్లడించారు. “మిలీనియం పార్క్ నుంచి రివర్ నార్త్ పరిసరాల్లోకి వెళ్లే మార్గంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రదర్శనకారులు దాదాపు రెండు గంటల్లో అక్కడికి చేరుకున్నారు. వలసదారులకు సంబంధించి నిర్బంధాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేశారు” అని స్వెట్ తెలిపారు. అటు ఈ అరెస్టులపై బోర్డర్ పెట్రోలింగ్ అధికారి కీలక విషయాలు వెల్లడించారు. “చికాడోలోని డౌన్ టౌన్ లో చాలా మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వారిని పట్టుకుని పూర్తి వివరాల గురించి ఆరా తీసిన తర్వాత వారిని అరెస్ట్ చేయడంతో పాటు సొంత దేశాలకు పంపిస్తాం” అని వెల్లడించారు.
EXCLUSIVE: Earlier today ICE agents chase after a man in downtown Chicago after he made verbal comments but no physical or threatening contact. The man was able to get away. pic.twitter.com/uOiHXSmQny
— Christopher Sweat (@SweatEm) September 28, 2025
సాయుధ ఫెడరల్ ఏజెంట్ల సమూహాలు డౌన్ టౌన్ లో కాలినడకన గస్తీ తిరగడం పట్ల గవర్నర్ JB ప్రిట్జ్ కర్, మేయర్ బ్రాండన్ జాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ నిర్ణయం చికాగోలో ఎవరినీ సురక్షితంగా ఉంచడం లేదు. బెదిరింపులకు దిగుతున్నట్లుగా ఉంది. ఇక్కడి కమ్యూనిటీలలో భయాన్ని కలిగించడం, వ్యాపారాలను దెబ్బతీయడం లాంటివి చేస్తుంది. అమెరికన్ నగరాలు, శివారు ప్రాంతాలను సైనికీకరించడాన్ని మేము తీవ్రంగా తప్పుబడుతున్నాం. ప్రజల హక్కులను తెలుసుకుని ఏజెంట్లు ప్రవర్తించడం మంచిది” అంటూ గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మేయర్ జాన్స్ కూడా ఐస్ ఏజెంట్ల మోహరింపుపై మండిపడ్డారు. “చికాగో వాసులు, సందర్శకులు ఆదివారం నాడు ఆనందంగా గడుపుతుండగా, స్పష్టమైన కారణం లేకుండా ఆటోమేటిక్ ఆయుధాలను ప్రదర్శిస్తూ, ఫెడరల్ ఏజెంట్లు వారిని బెదిరిస్తున్నారు. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న రెచ్చగొట్టే చర్య. సురక్షితమైన నగరంలో కావాలనే అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది” అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: కొండ చివరలో ఆ పని చేస్తుండగా.. జారి లోయలో పడ్డ కారు, స్పాట్ లోనే..
ICE was operating in downtown Chicago earlier today. Three arrests were made on a path from Millennium park all the way into the River North neighborhood. Demonstrators arrived about two hours in. @graystakmedia pic.twitter.com/PmQmX6UTbE
— Christopher Sweat (@SweatEm) September 28, 2025
Read Also: ప్రియుడితో భార్య సరసాలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఇదిగో వీడియో!