Bathukamma Festival: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు జర సేపట్లో అంబరాన్ని అంటనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరం బతుకమ్మ ఉత్సవాలతో మెరిసిపోతోంది. సరూర్ నగరంలో ఇండోర్ స్టేడియంలో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో 10,000 మంది మహిళలు పాల్గొంటున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఒకేసారి 1500 మంది మహిళలతో గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా 66.5 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఒక్కేసారి ఇంత మంది మహిళలతో బతుకమ్మ ఆడడం గిన్నిస్ వరల్డ్ రికార్డు చరిత్ర సృష్టించనుంది. బతుకమ్మ, ప్రకృతి దేవతలకు అర్పించే పుష్పాలు, బతుకమ్మ పాటలకు యువతులు, మహిళలు నృత్యాలు తెగ ఆకట్టుకుంటాయి. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు నివారించి, నగరంలో రోడ్లపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణాలు జరగాలని ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
ఈ రూట్ వెళ్లేవారికి అధికారులు కీలక సూచన
రాత్రి 9 గంటల వరకు, ఎల్.బి నగర్ నుంచి కొత్తాపేట మధ్య రోడ్డు మీద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ప్రయాణికులు ఈ మార్గాన్ని నివారించి, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు. దిల్ సుఖ్‌నగర్ నుంచి ఎల్.బి. నగర్ వైపు వెళ్లేవారు.. ఓమ్ని ఎక్స్ రోడ్స్ వద్ద నాగోల్ మార్గం వైపు ప్రయాణించాలని చెప్పారు. అలాగే, చింతలకుంట నుంచి దిల్సుఖ్‌నగర్ వైపు ప్రయాణించేవారు, చింతలకుంట ఎక్స్ రోడ్స్ వద్ద సాగర్ ఎక్స్ రోడ్స్, కర్మంఘాట్ వైపు ప్రయాణించాలని తెలిపారు. ఈ డైవర్షన్లు, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా కాపాడుతాయని అధికారులు వివరించారు.
ALSO READ: VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా చివరి రోజు.. సిటీ బస్సులో ప్రయాణించిన వీసీ సజ్జనార్
పార్కింగ్ వ్యవస్థలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. స్టేడియం సమీపంలో లభ్యమయ్యే స్థలాల్లో వాహనాలు ఆపాల్సి వస్తుందని చెప్పారు. పోలీసుల సూచనల ప్రకారం.. బతుకమ్మ ఉత్సవాలు భారీ వర్షాల కారణంగా ఎల్.బి. స్టేడియం నుంచి సరూర్ నగర్‌కు మార్చినట్టు వివరించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్కలు బతుకమ్మ ఏర్పాట్లు పరిశీలించారు. బతుకమ్మ పుష్పాలు, గుమ్మడి, తంగేడు, తామరలతో అలంకరించిన ఆకారాలు, మహిళల సొగసైన దుస్తులు, ఆటలు, గానం – అన్నీ ఒకే వేదికపై కనిపించనున్నాయి.. ఇది కేవలం ఉత్సవం కాదు, తెలంగాణ సంస్కృతికి అద్బుతమైన రూపం అని చెప్పవచ్చు.
రాచకొండ పోలీస్ కమిషనర్ నగర వాసులకు కీలక సూచనలు చేశారు. ఈ డైవర్షన్లు, ప్రణాళికగా ప్రయాణాలు చేస్తే, ఉత్సవం మరింత రంగుల హర్షంగా జరుగుతుందని అన్నారు. బతుకమ్మ మహోత్సవం, మహిళల శక్తి, ప్రకృతి సౌందర్యాన్ని గొప్పగా ప్రదర్శిస్తూ, హైదరాబాద్ ను కళకళలాడుతోంది. ఈ సందర్భంగా… నగరంలోని మహిళలు అందరూ సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించాలని కోరుకుందాం.