Raja Saab Trailer: పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మారుతి (Maruthi) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ది రాజా సాబ్ (The Raja Saab). ఈ సినిమా ప్రాజెక్ట్ పైన చాలామందికి విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. దీనికి కారణం ఈ సినిమాలో మారుతి ప్రభాస్ లోని కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బయటకు తీస్తున్నాడు. ఇదివరకే విడుదలైన టీజర్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది. ఇక తాజాగా సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
మూడు నిమిషాల 34 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ విజువల్ ట్రీట్ అని చెప్పాలి. ట్రైలర్ చూసాక ఖచ్చితంగా అంచనాలకు మించిపోయింది అని చెప్పక తప్పదు. అన్నింటిని మించి ప్రభాస్ లుక్స్ చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మొసలి విజువల్స్, ఇల్లు రివర్స్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మారుతి గట్టిగానే ప్లాన్ చేశాడు అని అర్థమవుతుంది. ట్రైలర్ లో వీటివి గణేష్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. మారుతి సినిమాల్లో ఒకప్పుడు సప్తగిరి కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. అది మరోసారి రిపీట్ అయ్యేటట్టు ఉంది.
కేవలం కామెడీ మాత్రమే కాకుండా మంచి కలర్ ఫుల్ గా కూడా మారుతీ డిజైన్ చేశాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సంజయ్ దత్ ని చూపించిన విధానం మెంటల్ మాస్. అన్నిటిని మించి ముసలని అలా ప్రభాస్ ఎగరేయటం అనేది నా భూతో నా భవిష్యత్. స్టైలిష్ లుక్ తో పాటు ఫస్ట్ లుక్ లో రిలీజ్ చేసిన లుక్కు కూడా ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. నేనేమీ చేయమను కాదు రాక్షసుడిని అని ప్రభాస్ ఎండింగ్ చెప్పే డైలాగ్ నెక్స్ట్ లెవెల్.
ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ గా ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ ఇచ్చేసాడు అనిపిస్తుంది. ఎప్పటినుంచో మిస్సయిన ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఈ సినిమాతో సక్సెస్ఫుల్ గా మారుతి బయటికి తీశాడు. ముఖ్యంగా ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తీసింది. ఆ సంస్థకు ఈ సినిమా ఒక బ్రాండ్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Also Read: Sobhita Dhulipala : తమిళ్ ప్రాజెక్టుకు శోభిత గ్రీన్ సిగ్నల్, క్రేజీ కాంబినేషన్ కంప్లీట్ డీటెయిల్స్